clean2politics

for save politics to uncivilized politicians

Tuesday, May 31, 2011

రాజకీయ మకీలీలకు చరమగీతం పాడుదాం

ఏం జరుగుతుందో తెలియదు
ఎందుకు జరగాలనుకుంటుందో తెలియదు
కానీ
జరగడం తథ్యం అనిపిస్తుంది, అది కనిపిస్తుంది

విశ్రుంఖలంగా మితిమీరుతున్న అలజడిని
అవిశ్రాంతంగా శ్రమిస్తున్నఆరాచకాన్నీ
చూస్తూ.. చేతలుడిగిపోతూ ఆగలేననే నిజాన్ని

బయటపెడుతుంది.
సహనానికి హద్దనే పెద్ద మాటలొద్దంటూనే
నిస్సహాయత వెన్ను విరుస్తూ మెగ్గ తొడుగుతుంది.
పాలెన్ని పోసినా పామునైజం మారదనే
నిజాన్ని నమ్ముతూ
నిస్సిగ్గుగా దోచుకునే ఈ రాజకీయ రాబందుల
రెక్కల్ని విరచడానికి, రక్తాన్ని పిండేయడానికి
జరగాల్సింది జరుపిస్తుంది.
అవును జరిగింది
అదిగో నవయవ్వన నూతన శకం
కనిపించలేదా...

నా కళ్లతో చూడండి
అవినీతి లేని, అన్యాయం లేని
దోపిడి లేని, పీడనలేని
నా బావి భారతాన్ని..

1 Comments:

At May 31, 2011 at 9:35 AM , Blogger sree n sree said...

IT SHOULD BE IMPLEMENTED BY EVERY YOUNG LEADER... THEN ONLY WE CAN SEE KEEN AND CLEAN POLITICS..

JAI HIND

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home