clean2politics

for save politics to uncivilized politicians

Friday, September 16, 2016

no to caste based reservations

pls give me big hands to save politics.

ఒక వ్యక్తి సమూహంగా ఉన్నా ఒంటరిగా ఉన్న అతనికే సొంతమైన ఒ వ్యక్తిత్వం ఉంటుంది అలాగే సమూహానికి కూడా, కానీ ఘడియ ఘడియకి
వ్యక్తి వ్యక్తిత్వం మారితే అల్పుడంటారు, కానీ పరిస్థితిని బట్టి సమూహ లక్య్ఘాలు మారుతూ ఉండాలి అప్పుడే నిత్య చైతన్యంతో
నిండిన ఆ సమాజం సమ సమాజంగా ఫరిఢవిల్లుతుంది, కానీ ఇది తిరగబడింది, ఆత్యాదునికమైన సాంకేతిక యుగంలో జీవిస్తూ
క్షణానికో ఆవిష్కరణ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ దశలో నా దేశానికేమైంది అనే ప్రశ్న వేలగొంతుకలతో నిలదీస్తుంది. ఎప్పుడో గతంలో
సామాజిక హోదాని ఆర్థిక స్వావలంభనని బూచిగా చూపి ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్వర్డ్ క్యాస్ట్ అనే పేరుని తగిలించి ఓ గుంపుని
సమూహానికి అంటరానిదిగా బావించి వెలివేయడం ఎంత వరకు సభబు.
ఆనాడు భారత రాజ్యాంగకర్త, భారత రత్న అంబేద్కర్ నాటి సమాజంలో ఉన్న అసమానతల్ని సరిచేయడానికి సామాజికంగా
మార్పు తేవడానికి యావత్ జాతిని ఒకే గొడుగు కిందకు తేవడానికి ఎంతో ముందుచూపుతో దార్శనికతతో 10 సంవత్సరాల పరిమితితో
ఏర్పాటు చేసిన రిజర్వేషన్లని, పూటకో మాటతో పబ్బం గడుపుకునే రాజకీయ నేతలు! నాటి సమాజ స్థితిగతులకి నేటి పరిస్థితులకి
విపరీతమైన మార్పులు వచ్చిన తర్వాత కూడా కొనసాగించడం ఎంతవరకు సహేతుకం? నాడు ఆర్థిక వ్యవస్థ సామాజిక హోదాపై ఆదారపడ్డది
కానీ నేటి సామాజిక హోదా ఆర్థిక స్థిరత్వం నుంచి పుట్టుకొస్తుంది అనే కఠిన సత్యాన్ని సైతం గుర్తించకుండా కేవలం సామాజిక పరంగా
అగ్రకులంలో జన్మించిన వ్యక్తిని పన్నుల పేరిట దోచి, ఆ దోచిన దాంట్లో అతని సమాజానికి కనీస భాగస్వామ్యం లేకుండా చేయడం
ఏ సమసమాజ న్యాయం?
పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడగూడదన్న మన న్యాయ ఏలిక అంతరార్థాన్ని
కూడా నేటి రాజకీయ పటాటోపులు అర్థం చేసుకోకపోవడం భాదాకరం అవును నిమ్మకులాలు అని మీరు చెప్పే వాల్లళ్లో 50శాతం ఇంకా అలాగే
(మీనివేదికల ప్రకారం మాత్రమే) ఉండొచ్చు, కానీ 70శాతం మా ప్రజలు సరైన తిండిలేక పిల్లల కనీస ప్రాథమిక అవసరాల్ని తీర్చలేని
నిస్సహాయస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు ఇది సమంజసమేనా? దీనికి మీ సమాదానమేంటీ, అందరికీ విద్య అంటూ అదరగొట్టే మీ ప్రచార పటాటోపం
కనీసం ఆ విద్యాలయాల్లో యూనిఫామ్ ని ఎందుకు దరింపజేస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తున్నారా? బాల్యం నుండే పిల్లల్లో ఏ రకమైన
తేడాలు లేకుండా పెరగాలని సర్వ సౌబ్రాత్రుత్వం అలవర్చుకోవాలని మనం అవలంబిస్తున్న యూనిఫామ్ విదానం ఐదో, ఆరో తరగతుల వరకి పిల్లాడికి
అర్థం కాకపోవచ్చు కానీ ఆపై చదువులకెల్తున్న ఒక రెడ్డి ఎందుకు నాకు ఉచిత పుస్తకాలివ్వట్లేదో తెలుసుకోలేడా? ఆపై చదువులకెల్తున్న ఒక రాజు
ఎందుకు నాకు స్కాలర్ షిప్పు రావట్లేదు అనే మీమాంస కలుగదా? అప్పుడు ఆ పసివాల్ల మనుషుల్లో మనం నాటుతున్నదేంటీ? దాని పర్యవసానం అతడిని
ఎంత క్షోబకి గురిచేస్తుంది (6వ తరగతి నుండి పై చదువులకెల్లే పిల్లాడికి ఇంతటి విచక్షణ రాలేకపోతే ఇంకా ఆ చదువుకి అర్థమేముంది).
కుల సర్టిఫికేట్లని ప్రభుత్వమే జారీచేస్తూ నువ్వు మాలవాడివి, మాదిగవాడివి, అని పదే పదే గుర్తుచేస్తున్న మీకన్నా వ్యక్తిగత కక్షలకీ కార్పణ్యాలకీ
అట్రాసిటీ కేసులతో నలుగుతున్న వారి దోషమేపాటిది? గ్లోబలైజేషన్, మాడ్రనైజేషన్, మెటీరియలైజేషన్ కాదు కావాల్సింది, అవసరాన్ని బట్టి సమూహ లక్ష్యాలని మార్చుకుంటూ
సమసమాజ స్థాపన ఏర్పాటు చేసే సివిలైజేషన్ కావాలి. అందుకే వ్యక్తిగా ద్రుడచిత్తం ఉన్న రాజీలేని రాజకీయ నాయకత్వం కావాలి. ఇతరుల అవసరాలతో పాటూ నా
అవసరాలనీ తీర్చే న్యాయమైన ప్రభుత్వం కావాలి. కుల మతాలని చెరిపేసే రిజర్వేషన్లు కావాలి, ఆర్థిక సామాజిక వెనకబాటు తనాన్ని పారద్రోలే రిజర్వేషన్లు కావాలి,
అందులో నాకూ బాగస్వామ్యం కావాలి. జైహింద్.


Wednesday, May 25, 2016

NTR and his Traveling

ఎన్టీఆర్ ఆ పేరే ప్రభంజనం, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్, 1923, మే 28న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం క్రుష్ణా జిల్లాలోని ఓ మారుమూల

పల్లెటూరు నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆరాద్యదైవమయ్యారు, సీనీ రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోయిన మహానేత ఎన్టీఆర్,

తెలుగువారి సాదారణ పేరైన రాముడి పేరుని ఇంటింటా మారుమోగేలా చేసి తన తరంలో ప్రతీ ఊరిలో సగం మంది రాముని పేరే పెట్టుకోవడానికి కారణబూతుడయ్యాడంటే అతిశయేక్తి కాదు,

ఆదునిక కాలంలో తెలుగు వారిని ఇంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరనేది నిర్వివాదాంశం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు ఎన్టీఆర్.  విజయవాడ మునిసిపలు

హైస్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ ప్రఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారి సాన్నిథ్యంలో  తొలిసారి నాటకరంగ

ప్రవేశం చేసాడు,  1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు, తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు.

అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల,

నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో వేసిన నాటకాలు ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల ఎనలేని అభిమానాన్ని కలుగజేశాయి.
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. నటవారసత్వాన్ని కుమారుడు భాలక్రుష్ణ తీసుకోగా

రాజకీయ వారసుడిగా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం 1949 నుండి మెదలైన ఆ నట విశ్వరూపం 1993లో దసరాకి వచ్చిన శ్రీనాథ కవిసార్వబైమా చిత్రం వరకూ అప్రతిహాతంగా సాగిపోయింది. తెలుగు, తమిళం

మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా

వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక,

రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55

జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు, చిన్న తనంలోనే చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బుందుల నుండి గట్టెక్కడానికి 1947లో డిగ్రీ పట్టా చేదికందగానే మద్రాసు సర్వీసు

కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం సాదించాడు. అయితే సినిమాలలో చేరాలనే

ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

ఎన్టీఆర్ సీనీ రంగ ప్రవేశం యాద్రుచ్చికంగా జరిగింది, ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో

కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు,  కానీ సినిమా నిర్మాణం

మొదలవలేదు. ఈలోగా మనదేశం సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. పల్లెటూరి పిల్లలో మెదట నటించినా విడుదలైంది మాత్రం మనదేశం. 1949లో వచ్చిన ఆ

సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల

తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు.

1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు

చిత్రం చంద్రహారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల

పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ

ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు, ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్టీఆర్.

1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి,

విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది.

శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది, ఆ విధంగా 1950-60లలో ఎన్టీఆర్ ఆంద్రుల అబిమాన

నటుడిగా మారాడు. సినిమా రంగంపై రామారావుగారిది అచంచలమైన కమిట్మెంట్, సంవత్సరానికి 10 సినిమాలకి తక్కువ కాకుండా నటిస్తూ పరిశ్రమ భాగోగులు చూసుకునేవాడు ఎన్టీఆర్,

ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికంవేలల్లోనే ఉండేది.72లో వచ్చిన శ్రీక్రుష్ణార్జున యుద్దం సినిమా నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.

బహుముఖ ప్రజ్నాశాలి అయిన ఎన్టీఆర్ దర్శకత్వంలోనూ విశేషప్రతిభ కనబర్చేవారు, ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. 1977లో

విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు.  ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు

విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయనబ్రహ్మర్షి విశ్వామిత్రని స్వయంగా నటించి, దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా

ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరౌైన ఇప్పటికీ ఎన్టీఆర్ లాగా డైలాగులు ఎవరూ చెప్పలేకపోవడం విశేషం, ఇలాంటి

ఎన్నో అంశాలు రామారావుని కారణజన్ముడుగా తెలుగు ప్రజలు నమ్మడానికి దోహదం చేశాయి.

ఇక రాజకీయంగా ఎన్టీఆర్ స్రుష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు, కేవలం పార్టీనీ స్థాపించిన తొమ్మిదినెలల్లోనే అదికారాన్ని చేజిక్కించుకొని యావత్ బారతాన్ని ఆశ్చర్యంలోనింపారు,

తొమ్మిదినెలల వయసున్న తెలుగుదేశం పార్టీతో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, చైతన్యరథాన్ని దౌడుతీయించి 97 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన తీరు అనన్య

సామాన్యం,
1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల

కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించడం ఇక్కడి ప్రజల ఇష్టాఇష్టాలతో సంబందం లేకుండా నిర్ణయాలు జరుగడం ఎన్టీఆర్ కి నచ్చలేదు.
1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై  "చైతన్యరథం"

తయారు చేయించి ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ

చైతన్యరథమే స్ఫూర్తి. అక్కడినుండి ఎన్టీఆర్ రాజకీయాలని పూర్తిస్థాయిలో ఔపోసన పడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను

సాగించాడు. చైతన్యరథమే నివాసంగా, ప్రచార వేదికగా, మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి చైతన్యరథంనుండి ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ

అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.
కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ ఎన్టీఆర్ దునుమాడిన తీరుకి మహామహానేతలే విస్మయం చెందారు
1983 జనవరి 7 న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ

9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అలా తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆంద్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాద్యాయాన్ని లిఖించాడు. అదికారం రాగానే ఎన్నో ప్రజాకర్షక పథకాల్ని

ప్రారంభించాడు,  సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. శాసనమండలిని రద్దు చేసాడు హైదరాబాదు లోని ట్యాంకుబండ్ పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు

నెలకొల్పాడు.తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.బలహీన వర్గాలకు

లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది.రెండు రూపాయలకే కిలో బియ్యంతెలుగుగంగ ప్రాజెక్టు, సామాజిక న్యాయం అమలు చేస్తూ బీసీ, ఎస్పీ,ఎస్టీలకు అదిక ప్రాదాన్యం

ఇచ్చిన పార్టీ టీడీపీ, 91లో ప్రదానిగా ఉన్నతెలుగువ్యక్తి పీవీ నంద్యాల ఉపఎన్నికలలో పోటీచేస్తే పోటీపెట్టకుండా గౌరవించిన విశిష్ట వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం, దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను

ఒకతాటిపైకి తెచ్చిన ఘనతలు ఎన్టీఆర్వేఅయితే ఆయన రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య

తూగుటూయలలా సాగింది. అధికారం చేపట్టిన తరువాత, ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వంటి అనేక వివాదాస్పద నిర్ణయాల వల్ల చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు.

ఆగష్టు సంక్షోభం అని చెప్పబడే, 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో తొలి దెబ్బతిన్న ఎన్టీఆర్ తిరిగి ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం కేంద్రప్రభుత్వానికి తప్పలేదు అలా  నెలరోజుల్లోనే, సంక్షోబాన్ని నివారించి

తన సమర్థతను చాటుకున్నారు, 1985లొ మద్యంతరానికి వెల్లి ఆదిక్యతని పెంచుకున్నాడు ఎన్టీఆర్, అయితే తదనంతరం తీసుకున్న నిర్ణయాలు, ఎకపక్ష పోకడలతో పాటు 1989లో

ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడుఇలాంటి చర్యలతో  తన ప్రాభవాన్ని కోల్పోయి అదికారాన్నీ కోల్పోయాడు,

అయితే ఎన్నికల్లో ఓడిపోయినా తొలిసారి కాంగ్రెస్కి జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా
 భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు,
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు.

శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. 93లో లక్ష్మీ పార్వతిని

పెళ్లిచేసుకోవడం కూడా ఆయనపై కొంతమంది దిక్కారానికి కారణంగా చెప్పుకోవచ్చు తిరిగి
1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ

ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం

వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి

మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల

వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.

ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.
pls give me big hands to save politics

Thursday, May 19, 2016

new districts and its role in telangana

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అడుగుజాడలో మనిషి మనిషికీ సహాయ సహకారాలందస్తూ, దేశ సౌబాత్రుత్వాన్ని, అభివ్రుద్దిని కాంక్షించే

దిశగా సాగే పయనంలో మన వ్యవస్థ ఏర్పరుచుకున్న అనేక పాలనా విబాగాల్లో జిల్లానే కేంద్రబిందువు, అంతటి విశిష్టత కలిగిన జిల్లాల ద్వారా పరిపాలన సజావుగా సాగుతూ,

ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్క్రుతిక వికాసమే కాక, రెవెన్యూ పరంగా భూమి, నీరు, భూమ్యాదారితంగా దొరికే అనేక విలువైన ఖనిజాలు ఇతరత్రా అటవీ సంపద

పెంపొందడమే కాక వాటిని దేశ విశాల ప్రయేజనాల కోసం కాపాడడం కూడా ముఖ్యమే,
స్వాతంత్రానికి పూర్వం ప్రావిన్సులుగా చెలామణి అయిన మన దేశం తర్వాత 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలతో బౌగోళికంగా విస్తరించింది, దేశం, రాష్ట్రం ఆ పరంపరలో

మూడవ పాలన పరమైన విభాగమే జిల్లా కేంద్రం,  ప్రస్తుతం 684 జిల్లాలున్నాయి, జిల్లాల ఏర్పాటులో 74వ సవరణ ద్వారా రాజ్యంగం పాలనాపరమైన సౌలబ్యాలకోసం

రాష్ర్టాలకు పూర్తి స్వేచ్చనిచ్చింది,
స్వాతంత్ర్యానంతరం జిల్లా స్థాయి పరిపాలన కొత్త పుంతలు తొక్క సాగింది. శాంతి భద్రతల పరిరక్షణ, రెవెన్యూ అంశాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు, ప్రజల సామాజిక

ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు జిల్లా పాలనా యంత్రాంగంలో ముఖ్య అంశాలయ్యాయి. విస్థీర్ణ పరంగా గుజరాత్ లోని కచ్ దాదాపు

నలబై ఆరువేల చదరపు కిలోమీటర్లతో పెద్ద జిల్లాగా ఉంది, పుదుచ్చేరి రాష్ర్టంలోని మహే జిల్లా కేవలం 9 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండడం విశేషం. ఇక కోటీ పది లక్షల

పైగా జనాబాతో మహారాష్ర్టలోని థానే జిల్లా అత్యంత జనాబాకలిగి ఉండగా, అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వాలీ జిల్లాలో కేవలం ఎనిమిదివేల మంది జనాబా ఉండడం గమనార్హం.
క్షే‌త్ర స్థాయిలో జిల్లా ఒక కీలకమైన యూనిట్‌.  1772లో వారెన్‌ హేస్టింగ్స్‌ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జిల్లాల పాలనా వ్యవస్థ
పౌర వ్యవహారాల అజమాయిషీ, నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఒక నిర్దుష్టమైన భౌగోళిక ప్రాంతంలో అమలుపరిచే ప్రభుత్వ విధివిధానాలను, చట్టపరమైన

అంశాలను, జిల్లా పాలనా వ్యవస్థ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలో జిల్లాలను గురించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరగలేదు. కాకపోతే,  ఏది ఏమైనప్పటికీ,

భౌగోళికంగా చిన్నదయినా, పెద్దదయినా పౌర పరిపాలనకు క్షేత్ర స్థాయిలో ఒక కీలకమైన కేంద్ర బిందువుగా, అనేక పరీక్షలకు, ఆటుపోట్లకు తట్టుకుని, కాలానుగుణంగా కొన్ని

మార్పులకు లోనవుతూ, నిలదొక్కుగోగలిగింది జిల్లా.  వర్తమాన గణంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం వున్న సుమారు 6,40,000 గ్రామాలను దేశంలోని 683 జిల్లాలతో

భాగించి చూసినట్లయితే అటు-ఇటుగా జిల్లాకు వెయ్యి గ్రామాలే వుంటాయి. తెలంగాణలో కూడా ఇప్పుడున్న 10,761 గ్రామాలు సగటున వెయ్యి గ్రామాల వంతున మొత్తం

పది జిల్లాలలో వ్యాపించి వున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే సరాసరిన, ప్రతి 500 గ్రామాలకు ఒక జిల్లా వుండబోతుంది. జిల్లా పరిపాలన, ప్రాథమికంగా మూడు లేదా

నాలుగు అంచెల్లో వుంటుంది.  మొదటి అంచె జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో, ఇతర జిల్లా స్థాయి అధికారుల సహాయంతో జరుగుతుంది. రెండవ స్థాయిలో సబ్‌ డివిజన్‌ లేదా

రెవిన్యూ డివిజన్‌ ద్వారా, మూడవ స్థాయిలో తహసీల్‌ లేదా మండలం ద్వారా పాలన జరుగుతుంది. అట్టడుగు స్థాయి లేదా క్షేత్ర స్థాయిలో గ్రామం యూనిట్‌గా వుంటుంది.

గ్రామం జిల్లా పరిపాలనలో ముఖ్య భూమిక వహించేది భూసంస్కరణలు, భూముల దైనందిన వ్యవహారం, భూ సేకరణ  భూముల రికార్డులు, భూమి శిస్తు. భూముల

అజమాయిషీ-నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూములను కాపాడడం, వాటిని పరిరక్షిస్తూనే సద్వినియోగ పరచడం, వ్వవసాయానికి ఉపయోగపడని బంజరు భూములను

కాపాడడం, అటవీ భూముల సంరక్షణ, నీటి మార్గాల నిర్వహణ తదితర అంశాలుంటాయి. జిల్లా పరిపాలనలో భూముల వ్యవహారమే కాకుండా వ్యవసాయ సంబంధమైన

అంశాలు, నీటి పారుదల, పరిశ్రమలు, పౌరసరఫరా, రవాణా, సమాజాభివృద్ధి కార్యక్రమాలు, సహకార సంఘాలు, విద్య, వైద్యం, సంక్షేమం, విపత్తులు, ఎన్నికల నిర్వహణ,

స్థానిక సంస్థలు తదితర వ్యవహారాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు కూడా వుంటాయి. వీటన్నింటి కన్నా ప్రధానమైంది కార్య నిర్వహణా బాధ్యతలు.... వీటికి

సంబంధించిన ప్రభుత్వ పరమైన వ్యవహారాలను, ఉన్నత స్థాయిలో, ఏకైక వ్యక్తిగా నిర్వహించేది జిల్లా కలెక్టర్‌.
కలెక్టర్ల అధికారాలు-విధులు-బాధ్యతలు ప్రస్తుతం రెండు రకాలుగా వున్నాయి. ఒకటి నియంత్రణాధికారాలు కాగా, మరొకటి, సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాల అమలు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలైన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు,

దళితులకు భూ పంపిణీ, హరితహారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు చేయటం లాంటివి వున్నాయి.

2014 జూన్2 న ఆవిర్బవించిన తెలంగాణా రాష్ర్టంలో రాజదానీ ప్రాంతాన్ని కలుపుకొని మెత్తం పదిజిల్లాలున్నాయి.  దాదాపు  లక్షా పదిహేనువేల చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో

పద్దెనిమిది వేయిల కిలొమీటర్లపైగా విస్థీర్ణంతో మహాబూబ్ నగర్ జిల్లా మెదటి స్థానంలో ఉండగా, 217 కిలోమిటర్లతో హైదరాబాద్ పదోస్థానంలో ఉంది, కానీ జన సాంద్రత

పరంగా 2011 జనాబా లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు 170 మందితో అదిలాబాద్ తక్కువ జనబా కలిగిఉండగా, అదే చదరపు కిలోమీటరుకు దాదాపు పంతొమ్మిది

వేల మందితో విశ్వనగరం జనసాంద్రత పెరిగిపోతుంది, దాదాపుగా దేశ జనాబాలో యాబై శాతం జనాబా 684 జిల్లాల్లో కేవలం 150 జిల్లాల్లోనే కేంద్రీక్రుతం కావడం చూస్తుంటే

పట్టణీకరణ ఎలా పెరిగిపోతుందో అర్థమవుతుంది. దీనికి హైదరాబాద్ నగరం కూడా మినహాయింపు కాదు, హైధరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో పాటు పారిశ్రామికంగా,

విద్యా, వైద్య పరంగా అభివ్రుద్ది ఏకీక్రుతం కావడం కూడా దీనికి ప్రదాన కారణం,

జిల్లాల విభజన అనేది ప్రస్తుతం ఉన్న డిమాండ్ కాదు గత పదిహేను సంవత్సరాలుగా వివిద సందర్భాల్లో ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది, చాలా జిల్లా కేంద్రాలు పల్లెలకు

అందుబాటులో లేకపోవడం, జిల్లాల విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో అభివ్రుద్ది ప్రక్రియ మందగించడం, ముఖ్యంగా వ్యవసాయాదారితమైన గ్రామీణ భారతానికి ప్రభుత్వ పరమైన

పర్యవేక్షణ, సరైన తోడ్పాడు లేకపోవడం వలన నూతన జిల్లాల డిమాండ్ అదికమైంది దీనికి తోడు కొన్ని రాజకీయ పరమైన కారణాలు కూడా ఇతోదిక పాత్రని పోషించాయి,
తెలంగాణాలో టీఆర్ఎస్ అదికారాన్ని చేపట్టన నుండే నూతన జిల్లాల ఏర్పాటు తథ్యం అనే సంకేతాల్ని ఇస్తూ వచ్చింది, ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 43 రెవెన్యూ డివిజన్లు,

457 మండలాలున్నాయి,  అయితే ఆంద్రప్రదేశ్ పునర్వవస్తీకరణ బిల్లులో పేర్కొన్నట్టుగా నియేజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పుడున్న 119 నియేజకవర్గాల స్థానంలో

140 నుండి 180 వరకూ పెరిగితే తదనుగుణంగా నూతన జిల్లాల్ని ఏర్పాటు చేయాలని భావించిన, కేంద్రం నుండి నియేజకవర్గాల పునర్విభజనకి సంభందించి లేటవ్వచ్చనే

సంకేతాల నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్బావ దినమైన జూన్2 న కొత్త జిల్లాల ప్రకటన చేయాలనే సంకల్పంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తొంది, దానికనుగుణంగానే  సీఎస్ రాజీవ్ శర్మ

చైర్మన్ గా కమిటీని నియమించింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ BR మీనా, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్

పీటర్ సభ్యులుగా… CCLA స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హాను కన్వీనర్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఈ కమిటీ జూన్2లోగా జిల్లాల ఏర్పాటుకు

సంభందించిన కసరత్తుని ముగించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి, కేసీఆర్ అనుకుంటున్నట్టుగా మెత్తం 24

జిల్లాలతో తెలంగాణా కొత్తగా మారబోతుంది ప్రస్తుతం ఉన్న జిల్లాలను విభజిస్తూ కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉంది.
 సికింద్రాబాద్ Contonement, కందుకూరు, మల్కాజ్గిరి, మేడ్చల్ నియేజకవర్గాలతో సికింద్రాబాద్ జిల్లా
, Bhuvanagiri, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహింపట్నంలతోHyderabad తూర్పు జిల్లా:
 జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, Patancheru, Sherlingampalli, Kutbullapur లతో Golconda జిల్లా:
 చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, కార్వాన్, మహేశ్వరం నియేజకవర్గాలతో Charminar జిల్లా
ఇక Hyderabad సెంట్రల్ జిల్లాలో నాంపల్లి, Ghoshamahal, Khairtabad, అంబర్పేట్, ముషీరాబాద్ నియేజకవర్గాలనీ,
Nizamabad జిల్లా పరిదిలోకి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ Rular, Armoor, బాలకొండ, Bhodan లను మాత్రమే ఉంచాలని,
KarimNagar జిల్లా కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి, Huzzurabad నియేజకవర్గాలని ఉంచి మిగతా వాటిని
Jagityal జిల్లాగా ఏర్పాటు చేస్తూ Jagityal, Korutla, వేములవాడ, హుస్నాబాద్, Dramapuri నియేజకవర్గాలని కలుపాలనీ
వరంగల్ల్ ప్రోపెసర్ జయశంకర్ సర్ పేరుతో Bhupalapalli జిల్లానీ ఏర్పాటు చేసి Bhupalapalli, మంథని, Mulugu, Narasampetaలని దాని పరిదిలోకి తేవాలని,
.జనగాం కేంద్రంగా,జనగాం, Mahabubad, స్టేషన్ Ghanapur, డోర్నకల్ లతో మరో జిల్లాను ఏర్పాటు చేయాలని
ఇక  వరంగల్ జిల్లాలో Waranagl పశ్చిమ, Waranagal తూర్పు, Palakurti, Wardanapet, Parakala లు మాత్రమే ఉంచేలా.
 మంచిర్యాల జిల్లాలోమంచిర్యాల, సిర్పూర్, KhagajNagar, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్లతో ఏర్పాటు చేసి
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, Bainsa, Bhode, ఖానాపూర్ లను మాత్రమే ఉంచనున్నారు,
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మదిర, పాలేర్, వ్యర, ఎల్లందులని మాత్రమే ఉంచి నూతనంగా Badrachalam జిల్లాని Badrachalam, పినపాక, అస్వరాపేట, Sattupalli,

Kottagudemలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి,
ఇక  నల్గొండ జిల్లాని రెండు బాగాలుగా చేసి  నల్గొండ, Nakirikel, Munugodu, దేవరకొండ, Nagarjunsagar లతో నల్గొండా జిల్లాని పరిమితం చేసి మరో జిల్లాగా
సూర్యాపేటని ఏర్పాటు చేసి సూర్యాపేట, కొడాద్, మిర్యాలగూడ, HuzzurNagar, Tungaturti నియేజకవర్గాలని దీని పరిదిలోకి తేనున్నారు,
మహబూబ్నగర్ జిల్లాని మూడు భాగాలుగా విభజించి మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల, Maktal, Devakadraలతో మహబూబ్నగర్ని
నాగర్కర్నూల్ కేంద్రంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచంపేట్, కొల్లాపూర్ లతో నాగర్ కర్నూల్ జిల్లా,
మరో జిల్లాగా వనపర్తి, గద్వాల, Aalampur, Narayanapeta, కోడంగల్ నియేజకవర్గాలతో వనపర్తి జిల్లాని ఏర్పాటు చేయనున్నారు.
మెదక్ జిల్లాలో మెదక్, యెల్లారెడ్డి, Bhansuwada, కామారెడ్డి, జుక్కల్ నియేజకవర్గాలతో ఉంచి
సిద్దిపేట ని జిల్లా కేంద్రంగా మార్చను్న్నారు ఇందులో సిద్దిపేట, Dubbaka, Gjawel, మానకొండూర్లతో పాటు ప్రస్తుత కరింనగర్ లోని  Siricilla నియేజకవర్గాన్ని కలుపాలనేది

ప్రతిపాదన మరో జిల్లాగా  సంగారెడ్డిని అప్ గ్రేడ్ చేస్తూ సంగారెడ్డి, Jaheerabad, అన్దోలె, NarayanKed, నర్సాపూర్ నియేజకవర్గాలని ఇందులో ఉంచనున్నారు.
ఈ రకంగా మెత్తం 24 జిల్లాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించి జూన్2న ప్రకటన చేయనుంది.
ఇందుకు కేంద్రం నుండి కూడా సానుకూల సంకేతాలు అందినట్టు తెలుస్తొంది,అందుకనుగుణంగానే ప్రస్తుతం కేంద్రం 44 మంది ఐఏఎస్, 30 మంది ఐపీఎస్, 13 మంది పారెస్ట్

అదికారుల్ని కేటాయించింది అయితే వాస్తవానికి మెత్తం 210 పై చీలుకు కేంద్ర స్థాయి అదికారుల్లో ప్రస్తుతం 30 మంది అదికారుల లోటుతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుంది,

మిగతావారిని కూడా విడతల వారీగా కేటాయిస్తామనే హమీ సైతం కేంద్రం నుంచి దక్కింది.

అయితే కేవలం జిల్లాలను ఏర్పాటు చేస్తేనే సరిపోదు దీనిలో రాజ్యంగబద్దమైన అనేక చిక్కుముడులు ఉన్నాయి, ప్రస్తుతం రాష్ట్రంలో 2018 నుండి 2020 వరకూ అదికారంలో

కొనసాగే వివిద పంచాయతీరాజ్, జడ్పీ, మున్సిపల్, నగర కార్యవర్గాలు కొనసాగుతున్నాయి రాజ్యంగ బద్దంగా వాటికి సంక్రమించిన అదికారాన్ని తీసివేసే అర్హత రాష్ర్ట

ప్రబుత్వానికి లేదు దీనితో కొత్తగా ఏర్పడే జిల్లాలకు తోడు మండలాలు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయాల్పి ఉంటుంది అలాంటి పక్షంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న
స్థానిక ప్రభుత్వం పరిదిని మార్చాల్సి ఉంటుంది దానికి తోడు వాటి రిజర్వేషన్ల దామాషాలు ఉండనే ఉన్నాయి ఇన్ని చిక్కుముళ్ల మద్య గతంలో ఎన్టీఆర్ హయాంలో కొత్త

మండల వ్యవస్థని ఏర్పాటు చేసిన రెండెళ్ల తర్వాత కానీ అదికారికంగా ఉనికిలోకి రాలేదు, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు మండల కేంద్రాలను రెవన్యూ

డివిజన్లను నగర పంచాయితీలను కూడా పెంచాల్సి ఉంది.

మరో చిక్కుముడి రాష్ర్టవ్యాప్తంగా వివిద ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి, గత రెండు సంవత్సరాలుగా స్థబ్దుగా ఉన్న తెలంగాణా మరోసారి ఉద్యమాలకు

సంసిద్దమౌతుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో మానుకోట జిల్లా కోసం అఖిలపక్షం రైల్‌రోకో నిర్వహించింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌

రైలు ఫ్లాట్‌ఫాంపైకి వస్తుండగా దూసుకువచ్చారు. మునిసిపాలిటీలో సీపీఐ కౌన్సిలర్లు ప్లకార్డులు, నల్ల జెం డాలతో బైఠాయించారు. సమ్మక్క-సారలమ్మ పేరిట ములుగు జిల్లా

కోరుతూ చేపట్టిన 48గంటల బంద్‌ విజయవంతమైంది. కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరిట జిల్లా కోసం భూపాలపల్లిలో

కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఒక్కరోజు దీక్షను చేపట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల జిల్లా కోసం జిల్లా సాధన విద్యార్థి పోరాట

సమితి చేపట్టిన ఆమరణ దీక్షలు చేశారు.  నేతలు ఆర్డీవో ఆఫీసుముందు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో బెల్లంపల్లి జిల్లాకోసం సోమగూడెం చౌరస్తావద్ద రిలేదీక్ష

చేపట్టారు. బెల్లంపల్లిని బొందల గడ్డలుగా మార్చి జీవన విధ్వంసం సృష్టించేందుకే ప్రభుత్వం బెల్లంపల్లి జిల్లాను తెరపైకి తేవడం లేదని వారు ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లాలో

మంథని జిల్లా కోరు తూ నిర్వహించిన 48గంటల బంద్‌ విజయవంతమైంది. మూడు జిల్లాల సరిహద్దులోగల హుస్నాబాద్‌ను జిల్లా చేయాలంటూ లోక్‌సత్తా ఆధ్వర్యంలో రౌండ్‌

టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రామగుండం జిల్లా ఏర్పా టుకోసం రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భువనగిరిజిల్లాలో ఇబ్రహీంపట్నం వంటి నియోజ కవర్గాలను

కలిపితే ప్రతిఘటిస్తామని ఇబ్రహీంపట్నం జిల్లా సాధన సమితి ప్రకటించింది. ఇలా ఉద్యమాలు వివిద ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు 14 కొత్త

జిల్లాల అవసరం లేదనే సామాజిక వేత్తలు కూడా ఉన్నారు, పరిపాలనా సౌలబ్యం కోసం రెండు మూడు జిల్లాలను పెంచితే సరిపోతుందనేది వారి వాదన తద్వారా గవర్నమెంట్

ఆపీసుల్లో పెరిగే దుబారాతో పాటు ఒక్కో జిల్లా ఏర్పాటుకు అవసరమయ్యే 100కోట్ల నిదులని వేరే రంగాలకి ఉపయేగించవచ్చనేది వారి సూచన.

ఏది ఏమైనా పరిపాలనా సౌలబ్యం కొసం జిల్లాల పెంపు సమర్థనీయమైనదే కానీ అదే ముసుగులో రియల్ దందా స్వైర విహారాన్ని కూడా అరికట్టాల్సిన బాద్యత సర్కార్

మీదుంటుంది, ఏతావాతా పరిశ్రమలు పెరిగి ఉపాది అవకాశాలు మెరుగైనప్పటికీ, పెంపుదల వల్ల కలిగే పెనుభారం నుండి సామాన్యున్ని కాపాడాల్సిన కర్తవ్యాన్ని ప్రబుత్వాలు

బుజాన కెత్తుకోవాలి, ఏదో ఇష్టారీతిన కాకుండా పటిష్టమైన వ్యవస్థలో సమగ్రమైన వివరాలతో అన్నిరకాలుగా ఆమెద యేగ్యమైన జిల్లాల ఏర్పాటును ప్రతీ ఒక్కరూ

స్వాగతిస్తారనేది కాదనలేని వాస్తవం.





Friday, May 13, 2016

రియే ఒలింపిక్స్ 2016, ఇండియా ఇట్స్ ఎబిలిటీ


రియే ఒలింపిక్స్ 2016, ఇండియా ఇట్స్ ఎబిలిటీ

క్రీడలు ప్రపంచ స్నేహ వారదులు అన్న నెల్సన్ మండెలా స్పూర్తిని నిజం చేస్తున్నాయి ఆదునిక ఒలింపిక్ గెమ్స్, ఆగస్లు 5 నుండి 21 వరకూ పదహారు రోజుల పాటు ప్రపంచ క్రీడాబిమానుల్ల్ని, ఆ మాటకొస్తే యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడానికి బ్రెజిల్ లోని రియేడిజనేరో నగరం వేదిక కానుంది, పదహారు రోజుల పాటు జరిగే ఈ సంరంబంలో దాదాపు 206 దేశాల నుండి ఇంచుమించుగా 10500 మంది  క్రిడాకారులు 306 క్రీడల్లో 41 విబాగాల్లో పోటీ పడబోతున్నారు, 2012 లండన్ ఒలింపిక్స్ఖ్ తరువాత ఇప్పుడు బ్రెజిల్ లోని సాంబా న్రుత్యాల మద్య కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల జిలుగుల్లో బ్రేజిల్ సాంప్రదాయాలకు అనుగుణంగా అగస్టు 5 వతేదీన జరిగే క్రీడా సంరంబం యావత్ ప్రపంచాన్ని ఉర్రూత లూపబోతుంది.

ఇంతటి ఘనమైన గేమ్స్ ప్రపంచం మెత్తాన్ని ఒక్కటి చేసే ఈవెంట్ ఒక్క క్రీడల్లోనే కాదు ఏ రంగంలోనూ దీనిని మించింది లేదు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర కూడా చాలా పెద్దది, ఒలింపిక్ క్రీడలు  ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు.క్రీ.పూ. 8 వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. గ్రీకు రాజ్యాల మధ్య తరుచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ.776 లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటినుంచి క్రీ.శ.393 వరకు ప్రతి నాలుగేళ్ళకోసారి ఒలింపిక్ క్రీడలు సాఫీగా నిర్వహించారు. క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా ఆపేవారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు, అప్పట్లో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జూలై నెలలో జరిగేవి. ప్రారంభంలో 9 క్రీడాంశాలతో ఒక రోజు మాత్రమే నిర్వహించేవారు కాని కాలక్రమేణా జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడాంశాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ రోజుల్లో క్రీడలు జరుగుతున్నన్ని రోజులు తమతమ ప్రజలు పనులు కూడా ఆపివేసి ఒలింపియా స్టేడియానికి పరుగులు పెట్టేవారు. క్రీడాంశాలలో పరుగు పందెంతో పాటు, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ మున్నగు పోటీలు జరిగేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి క్రీ.శ.393లో ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించాడు. ఆ తరువాత ఒలింపస్ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ క్రీ.శ. 1896 లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ, దాదాపు నాలుగేళ్ళకోసారి ఈ ఒలంపియాడ్ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలు గా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలను ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు.ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. మరుగున పడిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత ఈయనకే దక్కుతుంది. కాబట్టి ఇతడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ప్రసిద్ధి చెందినాడు. కోబర్టీన్ 1892లో ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని ప్రకటించాడు. క్రీడల పున:ప్రారంభానికి అతడు విపరీతంగా కృషి చేశాడు. అతడి పట్టుదల మూలంగా 1896లో మొదటిసారిగా ఎథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మరుగున పడిన ప్రదేశంలోనే తొలి ఆధునిక క్రీడలు నిర్వహించుట విశేషం. ఆ తరువాత 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్ లో జరగాల్సిన క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. మళ్ళీ 1940, 1944లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్ ఒలింపిక్ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. అలాగే రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. హంగేరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా 1956 మెల్బోర్న్‌ ఒలింపిక్ క్రీడలను హాలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలు బహిష్కరించాయి. వర్ణవివక్షత పాటిస్తున్న కారణంగా 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ క్రీడలలో పాల్గొనడాన్ని నిషేధించారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్ క్రీడలను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు పాల్గొనలేదు. తత్ఫలితంగా 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా, దాని మిత్ర దేశాలు బహిష్కరించాయి. ఈ విధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం ప్రారంభించిన క్రీడలు అపుడప్పుడు దేశాల మధ్య వైషమ్యాలు కూడా పెంచాయి 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 30 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008 లో చైనా లోని బీజింగ్ లో జరిగాయి. 2012 లో 30వ సమ్మర్ ఒలింపిక్స్ లండను లో జరిగాయి. 2016 అగస్లు 5 నుండి రియేలో ప్రారంబం కాబోతున్న క్రీడలు 31 వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు,

దాదాపుగా విశ్వాన్ని ఒక్కటి చేస్తున్న ఒలింపిక్ గెమ్స్ సింబల్ కూడా దీనికి ప్రతీకగా నిలుస్తుంది  ఒకదానితో ఒకటి గొలుసువలె కలిసిన ఐదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా,అమెరికా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు, . ఐదు రింగులు వరుసగా నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఐదు రింగులు ప్రజల క్రీడా స్ఫూర్తికి సౌభ్రాతృత్వానికి చిహ్నం, ఒలింపిక్ పతాకం క్రీస్తుశకం 1913లో బేరన్ పియరీ డీ కౌబర్టీన్ సలహాపై రూపొందించబడి, క్రీస్తుశకం 1914లో పారిస్లో ఆవిష్కరింపబడింది. అయితే క్రీ.శ. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో ప్రప్రథమంగా ఎగుర వేయబడినది. ఒలింపిక్ పతాకం తెల్లని పట్టుగుడ్డ మీద ఒకదానితో ఒకటి కలిసిన ఐదు రింగులు ఉంటాయి.

ఇంకా అనేక ప్రత్యేకతలున్న ఒలింపిక్స్లో అత్యంత ముఖ్యమైన విషయం ఒలింపిక్ టార్చ్ ది, ప్రాచీన గ్రీసులో లైట్ సూర్యుని ప్రతిరూపంగా భావించేవారు, ప్రాచీన గ్రీసుదేవాలయాల ముందు వారి దేవుడు హెస్టియా, ప్రోమేథీస్ ప్రతిరూపం గా బావించి పంచభూతాల మిలితంగా ఈ లైట్ని వెలిగించేవారు అదే అనవాయితీ ఈ విశ్వ క్రీడల్లో కూడా కొనసాగింది అయితే అదునిక ఒలింపిక్స్లో మెదటినుండి టార్చ్ రిలే అనేది లేదు 1928 అమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్లో మల్లీ టార్చ్ మెదలైంది కానీ నగరం మద్యలో స్టేడియమ్ ముందు మారథాన్ టవర్లో జ్వాల రూపంలో ఒలింపిక్ లైట్ని వెలిగించినా, ప్రాచీన గ్రీసు ప్రాంగణం నుండి ఒలింపిక్ నగరానికి రిలేగా మెదలైంది మాత్రం 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుండే అని చెప్పుకోవచ్చు, కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ టార్చ్ రిలేలో కొన్ని దేశాలు నిరసన వ్యక్తం చేయడంతో టార్చ్ రిలేతో పాటు ఒలింపిక్స్ గేమ్స్ మూల కారణమైన ప్రపంచ స్నేహా సంబందాలు దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో 2012 లండన్ ఒలింపిక్స్ నుండి కేవలం ఆతిథ్య దేశంలో మాత్రమే టార్చ్ రిలే నిర్వహిస్తున్నారు,

పతకాల విషయానికొస్తే ఒలింపిక్స్లోలో పాల్గొనడం క్రీడాకారుడు ఎంత గౌరవంగా భావిస్తాడో, పతకాలు సాదించడాన్ని ఆ దేశం అంతకంటే ఎక్కువ గౌరవంగా భావిస్తుంటుంది, ఒకానొక
సందర్భంలో ప్రచ్చన్న యుద్ద కాలంలో అమెరికా రష్యాల మద్య అదిపత్య పోరు ఎంతగా ఉండిందంటే ఒలింపిక్స్ పతకాల్లో అగ్రస్థానం కొసం తమ తమ దేశ అథ్లేట్లకి విపరీత శిక్షణని కూడా ఇచ్చాయి, ఈజాడ్యమే నేటి డోపింగ్ ల్లో దోషులుగా నిలబడే హీన స్థితికి క్రీడాకారుల్ని తీసుకెళ్లాయి, (బ్రదర్స్ సినిమా క్లిప్ వేయాలి)
 ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో  ఒకే ఒలింపిక్స్‌లో - ఒకటి కాదు రెండు కాదు - ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు మార్క్ స్పిట్జ్. తన క్రీడాజీవితంలో మొత్తం 9 స్వర్ణాలు సాధించాడు. ఒకే ఒలింపిక్ పోటీలలో అత్యధిక స్వర్ణాలు సాధించిన రికార్డు ఇప్పటికీ మార్క్ స్పిట్జ్ పేరిటే ఉంది.
ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా . పోలోవాల్ట్‌లో మకుటం లేని మహారాజుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించినా ఒలింపిక్స్‌లో కేవలం ఒకే స్వర్ణం సాధించటం గమనార్హం
మన దేశం విషయానికి వస్తే భారతదేశం తొలి సారిగా 1900 పారిస్ ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు ఆంగ్లో ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ ఆ ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించాడు. 1920లో తొలిసారి భారత్ జట్టును ఒలింపిక్ క్రీడలకు పంపినది. అప్పటి నుంచి ప్రతి వేసవి ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఇప్పటివరకు భారత్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో 24 పతకాలు సాధించిపెట్టారు. అందులో అత్యధికంగా మైదాన హాకీలో సాధించినవే. 1928 మరియు 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడలలో 11 పతకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. మొత్తంపై ఒలింపిక్ క్రీడలలో భారత్ 9 స్వర్ణ పతకాలను సాధించగా అందులో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా మరో స్వర్ణపతకం 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో షూటింగ్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు, అదే ఒలింపిక్స్లలో రెజ్లింగ్, బాక్సింగ్లో ఒక్కో కాంస్య పతకం లబించింది, వ్యక్తిగత విబాగాల్లో 1900ల్లో నార్మన్ ప్రిచర్డ్ అథ్లేటిక్స్లో  రెండు రజతాల్ని సాదించగా దాదాపు 50సంవత్సరాల తర్వాత 1952 హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్ లో కేపీ జాదవ్ రెజ్లింగ్లో మూడోస్తానాన్ని సాదించాడు, ఆతర్వాత ఇంచుమించు అరశతాభ్దం దగ్గర్లో 96అట్లాంట గేమ్స్లో లియాండర్ పేస్ టెన్నిస్లో కాంస్యాన్ని సాదించాడు, 2000లొ తెలుగు తేజం కరణం మల్లీశ్వరి వెయిట్ లిప్లింగ్లో కాంస్యాన్ని, 2004లో షూటింగ్లో రజతంతో సరిపెట్టాడు నేటి కేంద్ర మంత్రి రాజ్యవర్గన్ రాథోడ్, ఇక 2012 లో నాలుగు పతకాలు సాదించిన భారత టీం ఈ ఒలింపిక్స్లో నైనా భారీ పతకాల్ని తేవాలని సగటు భారతీయుని కోరిక,
అనేక అంశాలలో విశ్వ విజేతలుగా నిలబడుతున్న 100కోట్ల పై చీలుకు భారత సమాజం ఒలింపిక్స్ మెదలైనప్పటి నుండి పేలవమైన పలితాల్నే చూపిస్తుంది, ఒలింపిక్లో మనకి మాత్రమే స్థానమున్న మన జాతీయ క్రీడాహాకీ గత అరశతాబ్దం నుండి కనీసం క్వాలీపయింగ్ కే చెమటోడుస్తుంది,

భారత ఒలింపిక్ క్రీడల వ్యవహారాలను పర్యవేక్షించే భారత ఒలింపిక్ అసోసియేషన్ ను 1927లో స్థాపించినారు సర్ దొరాబ్జీ టాటా అద్యక్షుడుగా, ఏజీ నోహ్రేన్ జనరల్ సెక్రటరీగా మెదటి ఐఒఏ తన విదుల్ని నిర్వహించింది, తొమ్మిదవ కార్వవర్గం సురేశ్ కల్మాడీ అద్యక్షతన ఏర్పాటు కాగా అత్యంత అవినీతి ఆరోపణలతో భారత ఒలింపిక్ సంఘం పరువుని బజారు కీడ్చిందని చెప్పాలి, ప్రస్తుతం ఎన్ రామచంద్రన్ అద్యక్షతలోని ఐఓఏ బారత్ నుండి జంబో టీంను రియే ఒలింపిక్స్ కి పంపుతుంది, ఈ మద్య మనదేశం తరుపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని  గుడ్విల్ అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమయింది, బహుషా ఈ మద్య వార్తల్లో నలిగిన అత్యంత ముఖ్యమైన అంశంగా మారిన విషయం కూడా ఇదే అయితే భారత ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం గుడ్ విల్ అంబాసిడర్ వల్ల క్రీడల ప్రాచుర్యం పెరుగుతుందని అందుకే వివిద రంగాలకు చెందిన ముఖ్యుల్ని నియమిస్తామని చెపుతుంది సల్మాన్ తో పాటు క్రికెట్ గాడ్ సచిన్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా, అస్కారిస్ట్ ఏ ఆర్ రహ్మన్ని భారత గుడ్విల్ అంబాసిడర్లుగా నియమించింది,

వివాదాలు, ఆక్షేపణలు ఎన్నున్నా ఒలింపిక్స్ లాంటి గేమ్స్ ప్రపంచాన్ని స్నేహపూర్వకంగా మారుస్తాయనడంలో సంధేహం లేదు, బిజీ బిజీగా మారిపోయి ఆర్థిక వ్యవహారాల చుట్టూ తిరుగుతున్న సగటు వ్యక్తికి ఒ పక్షంరోజులు సంపూర్ణమైన మానసిక ఆనందాన్ని ఈ క్రీడలు కలుగజేస్తాయి, అలాగే 120 కోట్లకు పైగా ప్రజల ఆశల్ని మోస్తున్న మన క్రీడాకారులు ఆ కలల్ని నిజం చేయాలని మనస్పూర్తిగా మనమూ కోరుకుందాం,

Thursday, May 5, 2016

augusta westland chapper scam

pls give me big hands to save politics
అగస్టా వెస్టల్యండ్ 2012 చివర్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కుంభకోణం, తిరిగి తాజాగా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి ఎన్డీయే బయటకు తీసిన అస్రం, గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ఉభయసబల్లో ముఖ్యంగా పెద్దల సబలో సంఖ్యాబలంతో అధికార పార్టీని ముప్పతిప్పలు పెడుతున్న ప్రతిఫక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వదిలిన పాశుపతాస్రం

దీనిమీద 2013లోనే సీబీఐ దర్యాప్తు మెదలు పెట్టింది, అప్పట్లో ఈ కుంభకోణం చాపర్ స్కామ్, చాపర్ గేట్గా వెలుగులోకొచ్చింది, కానీ యూపీయే2 హయాంలో కేవలం దస్రాలకే పరిమితమైంది ఈ కుంభకోణం,

అగస్టా పూర్తి కథ బహు చిత్రంగా ఉంటుంది ఎక్కడో ఇటలీలో మెదలై భారత అగ్ర రాజకీయాన్ని తీవ్ర ప్రబావితం చేసిన కుంభకోణం, దాదాపు 3600కోట్ల అంచనాతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంభందించిన ఒప్పందం ఇది, ప్రదానమంత్రి ఇతర ముఖ్యుల పర్యటనల భద్రత కోసం తక్కువ ఎత్తులో తిరిగే హెలికాప్టర్లని కొనుగోలు చేయాలని యూపీయే2 అదికారంలోకొచ్చిన కొత్తలో ఒ నిర్ణయం తీసుకున్నారు, అందులో భాగంగా ఇటలీకి చెందిన రక్షణ పరికరాల సంస్థ ఫిన్ మెకానికాతో హెలికాప్టర్ల కొనుగోలుకు 2010 పిబ్రవరిలో యూపీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, ఈ హెలికాప్టర్ల తయారీ భాద్యతని పిన్ మెకానికా అనుభంద సంస్థ ఐన అగస్టావెస్ట్ల్యాండ్ తీసుకుంది, ఐతే ఈ ఒప్పందం కోసం భారత్ లోని వివిద వర్గాలకి దాదాపు 230 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారనేది ప్రధాన అబియేగం, ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటలీ ప్రబుత్వం దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి, పిబ్రవరి 2013లో పిన్ మెకానికా సీఈవో గిస్పెపీ ఓర్సీని ఇటలీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం ద్వారా మెత్తం కుంభకోణం వెలుగులోకి వచ్చింది,
అదేసమయంలో సుభ్రమణ్యస్వామి తన సొంత బ్లాగ్లో ఈకుంభకోణంకి సంబందించిన కొన్ని పత్రాలని బహిర్గత పరిచి తీవ్ర చర్చకు తెరతీసాడు, నింద తనమీదకి రాకుండా ఉండడం కోసం అప్పటి యూపీయే ప్రబుత్వం 30 మందితో పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది,
దర్యాప్తు సంస్థ విచారణలో ఆర్మీ డీలర్ ఐన అభిషేక్ వర్మది రోమన్ సంతతికి చెందిన అతని భార్య అనే నేక్సూ ది  చురుకైన పాత్రని తేల్చింది, రాజకీయంగా కీలక నేతలతో సంభందాలున్న అభిషేక్ వర్మ మద్య వర్తిత్వం నెరపడమే కాకుండా కాబినేట్ కమిటీనుండి సులువుగా క్లియరెన్స్ సర్టిపికెట్స్ సంపాదించిపెట్టాడు, ఈ మెత్తం వ్యవహారంలో ముడుపులు అందిన తీరుని గమనిస్తే కిక్ బాక్స్ సిస్టమ్ ద్వారా ముడుపుల సొమ్ముని తిరిగి భారత్కి చేరవేశాడు అందులో ముఖ్యంగా గొలుసు కంపెనీల ఏర్పాటు చేసి అగస్టావెస్ట్యాండ్నుండి మారిషన్ కేంద్రంగా నడుస్తున్న అట్లాస్ డిపెన్స్ సిస్టమ్ కంపెనీలొకి నిదుల రూపంలో మల్లించాడు అక్కడి నుండి బెర్ముడా అకౌంట్స్తో పాటు తన బార్య కంపెనీ ఐనా న్యూయార్క్ కంపెనీ లి. లోకి మల్లించాడు, అక్కడినుండి ఇండియాలోని అప్పటి కేంద్రమంత్రి సంతోష్ బర్కాడియా సొదరుడైన సతీస్ బర్కోడియా సారథ్యంలోని ఐడీస్ ఇన్పోటెక్లొకి డబ్బుల్ని ట్రాన్సఫర్ చేశారు, అక్కడి నుండి ప్రబుత్వ పెద్దలకి, అదికారులకి ఈ డబ్బు చేరిపోయింది. చండిఘడ్ కేంద్రగా ఉన్న ఈ సంస్థకి డిపెన్స్ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి ఈ ఒప్పదంలో కీలక భూమిక పోషించింది, 2005లోనే ఈ కంపెనీ డైరెక్టర్గా అప్పటి కేంద్రమంత్రి సంతోష్ బర్గాడియా కుమారుడు ప్రతాప్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు, దీన్ని బట్టి అగస్టా వెస్ట్ల్యాండ్కి యూపీయే1 హయాంలోనే బీజం పడింది అనుకోవచ్చు. ఇక సతీస్ బర్గాడియా అప్పటికే 600 కోట్ల కోల్ బ్లాక్ స్కామ్లో నిందితుడు,

సీబీఐ విచారణలో బాగంగా మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై అలాగే ఇటలీకి చెందిన అగస్టావెస్ట్ల్యాండ్, చండీఘడ్కి చెందిన ఐడీస్ ిఇన్పోటెక్, మరియు ఆక్రోమాట్రిక్స్ మీద అభియేగాలు నమేదు చేసింది, అభిషేక్తో పాటు అతని బార్య అనా నెక్సూని అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించడం జరిగింది,

ఈ కేసులో వెలుగులోకి వచ్చినప్పుడే యూపీయే2 సుమారు 2068కోట్లను తిరిగి రాబట్టామనే విషయాన్ని గొప్పగా ప్రచారం చేశారు కానీ 3600 కోట్లలో మిగిలిన 42.55 శాతం 1532 కోట్లు ఏమయ్యాయి, అంటే ముడుపుల సొమ్ము 260 కోట్లా లేక రాబట్టుకోలేక పోయిన మెత్తం సొత్తా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

దాదపు మూడు సంవత్సరాలుగా స్థబ్థుగా ఉన్న ఈకేసు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ఏంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పార్లమెంట్లో కదిపి మరోసారి తేనెతుట్టెను కదిలించాడు, ఇటలీ ప్రభుత్వ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి, ఇందులో ముడుపులు అందించడానికి ఎన్నుకొన్న కోడ్ లాంగ్వేజ్ యాంటీ టెర్రరిస్ట్ అక్టివిటీలో తలపండిన మేదావులు కూడా చాలాకాలం చేదించలేక పోయారు, గియూలీ, ఏపీ,సిన్యోరా గాంది, బీయూఆర్, ఏఎఫ్, వంటి కోడ్ నేమ్లు ఈ కేసులో ప్రదానంగా వినిపించాయి, సిన్యోరా అంటే సోనియా గాంది అని ఏ ఆర్ అంటే సోనియా రాజకీయ సలహాదారు ఆహ్మద్ పటేల్అని, ఇంకా మన్మోహన్ సింగ్, ఆస్కార్ పెర్నాండేజ్, వీరప్ప మెయిలీ, చివరికి ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ పేరు కూడా వినిపించింది, ముఖ్యంగా ఇటలీ దర్యాప్తు సంస్థలు అగస్టా వ్యవహరంలో కంపెనీ తరుపున మద్యవర్తిత్వం నడిపిన మైఖేల్ ఆ కంపెనీ ఇండియన్ హెడ్ పీటర్ హ్యూలైట్కి రాసిన లేఖలో డైవింగ్ పోర్స్ సోనియా అని పేర్కోనడంతో పాటు ఈ ప్రముఖుల పేర్లని భహిర్గతపరిచింది, ఇంత జరిగినా మన దర్యాప్తు సంస్థ ఆ లేఖని సంపాదించకపోవడం వెనుక మతలబు అర్థంకానిది ఏంకాదు, ఏ ప్రబుత్వం అదికారంలో ఉంటే వారికి వంతపాడడమే దీనికి కారణమనే విమర్షలు కూడా ఉన్నాయి. లంచం ఇచ్చిన అనేక మంది ఇటలీ అదికారులను ఆ దేశం నేరాన్ని నిరూపించి జైల్లో పెట్టగల్గింది, కానీ ఆ ఇటలీకి మల్లే మన ప్రబుత్వాలు ఖచ్చితమైన న్యాయ పనితనాన్ని చూపలేకపోవడం, మన దర్యాప్తు సంస్త పార్లమెంట్కి కాకుండా ప్రభుత్వాలకి భాద్యత వహించడం కారణ మనేది కాదనలేని సత్యం, ప్రస్తుతం పాలకులైన ఎన్డీయే నేతలైనా ఈ భండారాన్ని బయటపెడుతారా లేక కేవలం రాజ్యసభలో కాంగ్రెస్ సమ్మతిస్తే క్విడ్ ప్రో కో మాదిరిగా మీకది మాకిది అని వదిలేస్తారా వేచి చూడాలి.


hyderabad metro rail

pls give me big hands to save politics

దక్షిణ భారతానికి ముఖ ద్వారం లాంటి హైదరాబాద్ మహానగరం అంత కంతకూ వేగంగా విస్తరిస్తుంది దాదాపు కోటి మందికి చేరువలో నివసిస్తున్న మహానగరం ఇది
625 కిమి. విస్తీర్ణం కలిగి గ్రేటర్గా రూపాంతరం చెందిన భాగ్యనగరిలో ట్రాఫిక్ చిక్కులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి, దాదాపు 80లక్షల వాహనాలు రోజూ నగర రోడ్లపై పరుగులు పెడుతూ నగర జీవిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి, వీటికి 30

లక్షల పర్సనల్ వెహికిల్స్ అదనం, ఇంత రద్దీలో ప్రయాణీకుల అవస్థలని తీర్చడానికి ప్రత్యామ్నాయమే హైదరాబాద్ మెట్రో రైల్, దేశంలో ఇప్పటికే ప్రదానమైన ఏడు నగరాల ట్రాపిక్ సమస్యల్ని తీర్చిన మెట్రో మన హైదరాబాద్ సగటు

ప్రయాణాన్ని ఆహ్లద పర్చడానికి రూపుదిద్దుకుంటోంది, వివిద దశల చర్చల అనంతరం 2012 జులై 5 నుండి అదికార కార్యకలాపాల్ని ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైల్, దేశంలో పిపిపి పద్దతిలో, నిర్మించు, నడిపించు, బదిలీచేయు మాడల్లో

నిర్మితమవుతున్న అతి పెద్ద ప్రాజెక్ట్,  మెత్తం 72 కిలోమీటర్ల ప్రతిపాదనతో ప్రారంబమైన మెట్రో మెదటి పేజ్ ఆరు ధశల్లో 2017 లక్ష్యంగా ప్రారంబమయింది.
14 వేల కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ని ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది, ఇందులో ఎల్ అండ్ టీ వాటా 8550 కోట్లు దాదాపు 70శాతం మిగిలిన 30 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది కాగా భూసేకరణ బాద్యత

రాష్ర్టప్రబుత్వానిది.

మూడు ప్రదానమైన ట్రాపిక్ ఏరియాలలో మెట్రో రైలు నిర్మితమవుతుంది, కారిడార్1లో మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మెత్తం 29 కిలోమిటర్ల దూరం 27 స్లెషన్లతో 45 నిమిషాలలో గమ్యస్థానాన్ని చేరుతుంది, బస్సు ప్రయాణంతో పోలిస్తే

దాదపు 120 శాతం తక్కువ టైం కావడం విశేషం,
ఇక ఇప్పటికే కారిడార్1 లొ బాగంగా మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకూ పిల్లర్లతో పాటు స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు,
 కూకట్ పల్లి నుండి అమీర్ పేట్ వరకూ చురుకుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి, చారిత్రక విశిష్టత కలిగిన అసెంబ్లీ, రవీంద్రబారతీ, గాందీబవన్లు ఈమార్గం లోనే ఉన్నాయి ఇక్కడ పనులు మందకోడిగా సాగుతున్నాయి, ఎల్బీనగర్

నుండి ఉస్మానియా మెడికల్ కలాశాల వరకు పనులు చురుగ్గా సాగుతున్నాయి  ఈ కారిడార్లోని అమీర్ పేట్ జంక్షన్ కారిడార్1 ని కారిడార్3 ని కలుపుతుంది, కారిడార్ 1 పూర్తిగా 2018కి అందుబాటులోకి రావచ్చిని మెట్రో అదికారులు

చెబుతున్నారుకారిడార్2 విషయానికి వస్తే జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఫలక్నూమా వరకు మెత్తం 15 కిలోమీటర్ల దూరాన్ని 16 స్టేషన్లతో అనుసందానం చేస్తూ నిర్మిస్తున్నారు,  ఈ మెట్రో లైన్ పూర్తయి అందుబాటులో కొస్తే గంట పదినిమిషాలు పట్టే

రోడ్డు ప్రయాణం కేవలం 22 నిమిషాలలోనే గమ్యాన్ని చేరుస్తుంది,
ఈ మార్గంలోనే సుల్తాన్ బజార్ కోఠీ మార్గం ఉంది, మెట్రో స్థల సేకరణలో అత్యంత వివాదమైన ప్రాంతం ఇదే, మెత్తం 269 ఎకరాల విస్తీర్ణంలోని హైదరాబాద్ మెట్రోలో కేవలం 1కిలోమీటరు పొడవుగల సుల్తాన్ బజార్లోని వ్యాపారుల జీవనం

రొడ్డుమీద పడడమే కాకుండా పలు చారిత్రక కట్టడాలకు కూడా నష్టం కలుగుతోందంటూ స్థానికులు పనులు మెదలయినప్పటినుండే ఆందోళనలు నిర్వహిస్తున్నారు, వాటి తీవ్రత ఎంతలా ఉందంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆందోళనలకు

మద్దతు పలకడమే కాకుండా సీఎం అయిన తొలినాళ్లలోనే మార్గాన్ని మార్చమని సూచించారు కూడా. ఇది కూడా అక్కడి పనులకి అంతరాయం కలిగించి మెట్రో ఆలస్యమయేందుకు కారణమనే అభిప్రాయం కూడా ఉంది.
మూడవ కారిడార్లో బాగంగా నాగోల్ నుండి శిల్పారామం వరకూ 28 కి.మీ దూరంతో మెత్తం 23 స్టేషన్లను నిర్మిస్తున్నారు, ప్రయాణ సమయం దాదాపు 39 నిమిషాలు ఉంటుంది, ఈ మార్గంలో రోడ్డుప్రయాణమైతే ప్రస్తుతం గంటన్నరకు పైగానే

ఉంది, ఈ మార్గంలో
నాగోల్ నుండి మెట్టుగూడా వరకు పిల్లర్లతో పాటు స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తయి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు,  అమీర్పేట్ జంక్షన్ మినహా పెద్దగా ఇబ్బందులేం లేవు, జేబీఎస్ వద్దనున్న పరేడ్ గ్రేండు కారిడార్ 2 కి 3 కి జంక్షన్ గా

ఉంటుంది,అమీర్పేట్ 1కి 3 కి జంక్షన్ గా ఉంటుంది,

ఇక హైదరాబాద్ మెట్రో మెదటి పేజ్ లో అనేక విశిష్టతలున్నాయి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మెట్రో హైదరాబాద్ ది కావడం ఒక ఎత్తైతే, పూర్తి సిబీటీసీ సాంకేతిక పరిజ్ణానంతో నిర్మితమవుతున్న మెట్రో కూడా ఇదే, మూడు కారిడార్లోని రైళ్లని

ఉప్పల్లో ఉన్న ప్రధాన డిపోద్వారా నేరుగా కంట్రోల్ చేయగలిగే సామర్త్యం దీని సొంతం, సిటీ మెత్తం ప్రతిపాదించిన 2800 పిల్లర్లో 2400 పిల్లర్ల నిర్మాణం పూర్తంది, ఈ పిల్లర్ల మీదుగా రెండువైపులా 1435 ఎంఎం స్టాండర్డ్ గేజ్తో ట్రాక్లని

నిర్మిస్తున్నారు, 25 కేవీల సామర్థ్యం గల ఇంజిన్లని ఉపయేగిస్తారు, ట్రాక్ రన్నింగ్ పొటెన్సియల్ ద్వారా కూడా మెట్రోకి అవసరమయ్యే విద్యుత్తులో కొంత బాగం అదే ఉత్పత్తి చేసుకోవడం విశేషం, హైదరాబాద్ మెట్రో స్థలం  కూడా దీనికి

ముఖ్యమైన ఎసెట్ అనే చెప్పాలి 269 ఎకరాలలో 212 ఎకరాలు మెత్తం డిపోల నిర్మాణానికి పట్టగా, 57 ఎకరాలని పార్కింగ్ కోసం వదిలారు, అంటే మెట్రోకి వివిద మార్గాల్లో చెరుకునే వారికి పార్కింగ్ సమస్యలు లేనట్టే, నిర్మితమవుతున్న 66

స్టేషన్లలో 189 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని ఎల్ అండ్ టీ సంస్థ అభిప్రుద్ది పరుస్తుంది, భవిష్యత్తులో దీని ద్వారానే మెట్రోకి 45 శాతం ఆదాయం వచ్చేట్టుగా రూపుదిద్దడం మరో విశేషం, దీనితో పాటు 60 లక్షల చదరపు అడుగుల

ఆకాశ మార్గాల అనుసందానం ద్వారా వాణిజ్య సముదాయాలుగా మలచబోతున్నారు, ట్రాక్ కి 300 మీటర్ల వరకూ ఈ నిర్మాణాలు ఉండబోతున్నాయి. ఆటోమేటిక్ టికెటింగ్ సిస్టం, ఎస్కలేటర్లు, లిప్ట్లులు,పోన్టు, కమ్యునికేషన్ సిస్టం,

ఆటోమేటిక్ డోర్లు, పుల్లీ ఎయిర్ కండీషన్డ్ స్టేషన్లు, కోచ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోనే అత్యున్నతమైన అర్హతలన్ని హైధరాబాద్ మెట్రోకి ఉన్నాయి. ఇన్ని హంగులు ఉన్నాయంటే టికెట్ రెటు ఎంతుంటుందో అని భయపడాల్సిన పని

లేదు 8 నుండి 13 రూపాయలతో స్టార్టింగ్ ప్రైస్ ఉండబోతుంది, భవిష్యత్తులో మెట్రో వినియేగం లోకి వచ్చాక టిక్కెట్ల ద్వారా 50 శాతం, వాణిజ్య స్థలాల ఆదాయం ద్వారా 45శాతం, ప్రకటనల ద్వారా 5 శాతం ఆదాయాన్ని గడించాలనే

అంచనాలని సిద్దం చేసుకుంది.
నిర్మాణం ప్రారంబం నుండి 35 సంవత్సరాల మెయింటేనెన్సుతో పాటు 25 సంవత్సరాల పొడగింపు అవకాశంతో ఎల్ అండ్ టీ ఈ భారీ ప్రాజెక్ట్ని చేపట్టింది, అన్నీ సజావుగా సాగి 2017కి ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్న అంచనాలు కొంచెం తప్పాయి,

2018 ముగింపు సమయానికి మెట్రోని ఖచ్చితంగా పట్టాలెక్కించాలనే నిర్దేశంతో పనిచేస్తున్నట్టు మెట్రో అదికారులు చెబుతున్నా, కోర్టు కేసులు, ప్రబుత్వ ప్రాథామ్యాలు మారకుండా ఉండి నిర్ణిత సమయంలో పూర్తయి ట్రాపిక్ నరకం నుండి

బయట పడేయాలని సగటు నగర వాసి కోరుకుంటున్నాడు


Saturday, January 25, 2014

pls give me big hands to save politics

Thursday, August 9, 2012


sudheer-sahityam.blogspot.inpls give me big hands to save politics