clean2politics

for save politics to uncivilized politicians

Wednesday, May 25, 2016

NTR and his Traveling

ఎన్టీఆర్ ఆ పేరే ప్రభంజనం, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్, 1923, మే 28న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం క్రుష్ణా జిల్లాలోని ఓ మారుమూల

పల్లెటూరు నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆరాద్యదైవమయ్యారు, సీనీ రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోయిన మహానేత ఎన్టీఆర్,

తెలుగువారి సాదారణ పేరైన రాముడి పేరుని ఇంటింటా మారుమోగేలా చేసి తన తరంలో ప్రతీ ఊరిలో సగం మంది రాముని పేరే పెట్టుకోవడానికి కారణబూతుడయ్యాడంటే అతిశయేక్తి కాదు,

ఆదునిక కాలంలో తెలుగు వారిని ఇంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరనేది నిర్వివాదాంశం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు ఎన్టీఆర్.  విజయవాడ మునిసిపలు

హైస్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ ప్రఖ్యాత రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారి సాన్నిథ్యంలో  తొలిసారి నాటకరంగ

ప్రవేశం చేసాడు,  1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు, తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేరాడు.

అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల,

నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో వేసిన నాటకాలు ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల ఎనలేని అభిమానాన్ని కలుగజేశాయి.
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. నటవారసత్వాన్ని కుమారుడు భాలక్రుష్ణ తీసుకోగా

రాజకీయ వారసుడిగా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా ప్రస్థానం 1949 నుండి మెదలైన ఆ నట విశ్వరూపం 1993లో దసరాకి వచ్చిన శ్రీనాథ కవిసార్వబైమా చిత్రం వరకూ అప్రతిహాతంగా సాగిపోయింది. తెలుగు, తమిళం

మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా

వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక,

రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55

జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు, చిన్న తనంలోనే చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బుందుల నుండి గట్టెక్కడానికి 1947లో డిగ్రీ పట్టా చేదికందగానే మద్రాసు సర్వీసు

కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం సాదించాడు. అయితే సినిమాలలో చేరాలనే

ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

ఎన్టీఆర్ సీనీ రంగ ప్రవేశం యాద్రుచ్చికంగా జరిగింది, ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో

కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు,  కానీ సినిమా నిర్మాణం

మొదలవలేదు. ఈలోగా మనదేశం సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. పల్లెటూరి పిల్లలో మెదట నటించినా విడుదలైంది మాత్రం మనదేశం. 1949లో వచ్చిన ఆ

సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాల

తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు.

1951లో కె.వి.రెడ్డి పాతాళభైరవి, దాని తరువాత అదే సంవత్సరం బి.ఎన్‌.రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వీ ప్రసాదు పెళ్ళిచేసి చూడు, ఆ తరువాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు

చిత్రం చంద్రహారం ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు 5000 రూపాయిల

పారితోషికమూ ఇచ్చారు. పాతాళభైరవి 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, స్ఫురద్రూపంతో, వెలుగులు విరజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ

ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయాడు, ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్టీఆర్.

1956లో విడుదలైన మాయాబజార్‌లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. 1959లో ఏ.వి.యం.ప్రొడక్షన్స్ వారు నిర్మించి,

విడుదల చేసిన భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం భారీ విజయం సాధించింది.

శ్రీమద్విరాటపర్వములో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. 1963లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది, ఆ విధంగా 1950-60లలో ఎన్టీఆర్ ఆంద్రుల అబిమాన

నటుడిగా మారాడు. సినిమా రంగంపై రామారావుగారిది అచంచలమైన కమిట్మెంట్, సంవత్సరానికి 10 సినిమాలకి తక్కువ కాకుండా నటిస్తూ పరిశ్రమ భాగోగులు చూసుకునేవాడు ఎన్టీఆర్,

ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికంవేలల్లోనే ఉండేది.72లో వచ్చిన శ్రీక్రుష్ణార్జున యుద్దం సినిమా నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.

బహుముఖ ప్రజ్నాశాలి అయిన ఎన్టీఆర్ దర్శకత్వంలోనూ విశేషప్రతిభ కనబర్చేవారు, ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం. 1977లో

విడుదలైన దాన వీర శూర కర్ణలో ఆయన మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేసాడు.  ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవిరాముడు, యమగోల గొప్ప బాక్సాఫీసు

విజయం సాధించాయి. 1991 ఎన్నికల ప్రచారం కోసం ఆయనబ్రహ్మర్షి విశ్వామిత్రని స్వయంగా నటించి, దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. నర్తనశాల సినిమా కోసం ఆయన వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు. వృత్తిపట్ల ఆయన నిబద్ధత అటువంటిది. కెమెరా

ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతూంటారు, డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరౌైన ఇప్పటికీ ఎన్టీఆర్ లాగా డైలాగులు ఎవరూ చెప్పలేకపోవడం విశేషం, ఇలాంటి

ఎన్నో అంశాలు రామారావుని కారణజన్ముడుగా తెలుగు ప్రజలు నమ్మడానికి దోహదం చేశాయి.

ఇక రాజకీయంగా ఎన్టీఆర్ స్రుష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు, కేవలం పార్టీనీ స్థాపించిన తొమ్మిదినెలల్లోనే అదికారాన్ని చేజిక్కించుకొని యావత్ బారతాన్ని ఆశ్చర్యంలోనింపారు,

తొమ్మిదినెలల వయసున్న తెలుగుదేశం పార్టీతో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, చైతన్యరథాన్ని దౌడుతీయించి 97 ఏళ్లకు పైబడిన కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన తీరు అనన్య

సామాన్యం,
1978లో ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారానికి వచ్చిన కాంగ్రేసు పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలయ్యింది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. ఐదు సంవత్సరాల

కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించడం ఇక్కడి ప్రజల ఇష్టాఇష్టాలతో సంబందం లేకుండా నిర్ణయాలు జరుగడం ఎన్టీఆర్ కి నచ్చలేదు.
1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై  "చైతన్యరథం"

తయారు చేయించి ఆ రథంపై "తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!" అనే నినాదం రాయించాడు. ఆ తరువాతి కాలంలో భారత రాజకీయాల్లో పరుగులెత్తిన ఎన్నో రథాలకు ఈ

చైతన్యరథమే స్ఫూర్తి. అక్కడినుండి ఎన్టీఆర్ రాజకీయాలని పూర్తిస్థాయిలో ఔపోసన పడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను

సాగించాడు. చైతన్యరథమే నివాసంగా, ప్రచార వేదికగా, మారిపోయింది. ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి చైతన్యరథంనుండి ఎన్టీఆర్ చేసే ప్రసంగాలు ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ

అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసాడు. కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన ప్రచార ప్రభంజనమది.
కాంగ్రెసు నాయకులు కుక్కమూతి పిందెలనీ, కొజ్జాలనీ, దగాకోరులనీ, దగుల్బాజీలని, అధిష్టానం చేతిలో కీలుబొమ్మలనీ ఎన్టీఆర్ దునుమాడిన తీరుకి మహామహానేతలే విస్మయం చెందారు
1983 జనవరి 7 న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ

9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. అలా తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఆంద్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాద్యాయాన్ని లిఖించాడు. అదికారం రాగానే ఎన్నో ప్రజాకర్షక పథకాల్ని

ప్రారంభించాడు,  సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. శాసనమండలిని రద్దు చేసాడు హైదరాబాదు లోని ట్యాంకుబండ్ పై సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు

నెలకొల్పాడు.తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.బలహీన వర్గాలకు

లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది.రెండు రూపాయలకే కిలో బియ్యంతెలుగుగంగ ప్రాజెక్టు, సామాజిక న్యాయం అమలు చేస్తూ బీసీ, ఎస్పీ,ఎస్టీలకు అదిక ప్రాదాన్యం

ఇచ్చిన పార్టీ టీడీపీ, 91లో ప్రదానిగా ఉన్నతెలుగువ్యక్తి పీవీ నంద్యాల ఉపఎన్నికలలో పోటీచేస్తే పోటీపెట్టకుండా గౌరవించిన విశిష్ట వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం, దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను

ఒకతాటిపైకి తెచ్చిన ఘనతలు ఎన్టీఆర్వేఅయితే ఆయన రాజకీయ జీవితం అలా -నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకూ, అవమానకరమైన అపజయాలకూ మధ్య

తూగుటూయలలా సాగింది. అధికారం చేపట్టిన తరువాత, ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు వంటి అనేక వివాదాస్పద నిర్ణయాల వల్ల చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు.

ఆగష్టు సంక్షోభం అని చెప్పబడే, 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో తొలి దెబ్బతిన్న ఎన్టీఆర్ తిరిగి ప్రజల్లోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ

ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమ ఫలితంగా సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్టించడం కేంద్రప్రభుత్వానికి తప్పలేదు అలా  నెలరోజుల్లోనే, సంక్షోబాన్ని నివారించి

తన సమర్థతను చాటుకున్నారు, 1985లొ మద్యంతరానికి వెల్లి ఆదిక్యతని పెంచుకున్నాడు ఎన్టీఆర్, అయితే తదనంతరం తీసుకున్న నిర్ణయాలు, ఎకపక్ష పోకడలతో పాటు 1989లో

ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడుఇలాంటి చర్యలతో  తన ప్రాభవాన్ని కోల్పోయి అదికారాన్నీ కోల్పోయాడు,

అయితే ఎన్నికల్లో ఓడిపోయినా తొలిసారి కాంగ్రెస్కి జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా
 భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు,
1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు.

శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. 93లో లక్ష్మీ పార్వతిని

పెళ్లిచేసుకోవడం కూడా ఆయనపై కొంతమంది దిక్కారానికి కారణంగా చెప్పుకోవచ్చు తిరిగి
1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ

ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవటం

వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్టగా ఆయన అల్లుడు, ఆనాటి

మంత్రీ అయిన నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతికాలంలోనే, 1996 జనవరి 18న 73 సంవత్సరాల

వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు.

ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను తిరుగులేని నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.
pls give me big hands to save politics

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home