clean2politics

for save politics to uncivilized politicians

Thursday, May 19, 2016

new districts and its role in telangana

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అడుగుజాడలో మనిషి మనిషికీ సహాయ సహకారాలందస్తూ, దేశ సౌబాత్రుత్వాన్ని, అభివ్రుద్దిని కాంక్షించే

దిశగా సాగే పయనంలో మన వ్యవస్థ ఏర్పరుచుకున్న అనేక పాలనా విబాగాల్లో జిల్లానే కేంద్రబిందువు, అంతటి విశిష్టత కలిగిన జిల్లాల ద్వారా పరిపాలన సజావుగా సాగుతూ,

ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్క్రుతిక వికాసమే కాక, రెవెన్యూ పరంగా భూమి, నీరు, భూమ్యాదారితంగా దొరికే అనేక విలువైన ఖనిజాలు ఇతరత్రా అటవీ సంపద

పెంపొందడమే కాక వాటిని దేశ విశాల ప్రయేజనాల కోసం కాపాడడం కూడా ముఖ్యమే,
స్వాతంత్రానికి పూర్వం ప్రావిన్సులుగా చెలామణి అయిన మన దేశం తర్వాత 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలతో బౌగోళికంగా విస్తరించింది, దేశం, రాష్ట్రం ఆ పరంపరలో

మూడవ పాలన పరమైన విభాగమే జిల్లా కేంద్రం,  ప్రస్తుతం 684 జిల్లాలున్నాయి, జిల్లాల ఏర్పాటులో 74వ సవరణ ద్వారా రాజ్యంగం పాలనాపరమైన సౌలబ్యాలకోసం

రాష్ర్టాలకు పూర్తి స్వేచ్చనిచ్చింది,
స్వాతంత్ర్యానంతరం జిల్లా స్థాయి పరిపాలన కొత్త పుంతలు తొక్క సాగింది. శాంతి భద్రతల పరిరక్షణ, రెవెన్యూ అంశాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు, ప్రజల సామాజిక

ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు జిల్లా పాలనా యంత్రాంగంలో ముఖ్య అంశాలయ్యాయి. విస్థీర్ణ పరంగా గుజరాత్ లోని కచ్ దాదాపు

నలబై ఆరువేల చదరపు కిలోమీటర్లతో పెద్ద జిల్లాగా ఉంది, పుదుచ్చేరి రాష్ర్టంలోని మహే జిల్లా కేవలం 9 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండడం విశేషం. ఇక కోటీ పది లక్షల

పైగా జనాబాతో మహారాష్ర్టలోని థానే జిల్లా అత్యంత జనాబాకలిగి ఉండగా, అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వాలీ జిల్లాలో కేవలం ఎనిమిదివేల మంది జనాబా ఉండడం గమనార్హం.
క్షే‌త్ర స్థాయిలో జిల్లా ఒక కీలకమైన యూనిట్‌.  1772లో వారెన్‌ హేస్టింగ్స్‌ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జిల్లాల పాలనా వ్యవస్థ
పౌర వ్యవహారాల అజమాయిషీ, నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ఒక నిర్దుష్టమైన భౌగోళిక ప్రాంతంలో అమలుపరిచే ప్రభుత్వ విధివిధానాలను, చట్టపరమైన

అంశాలను, జిల్లా పాలనా వ్యవస్థ అని పిలుస్తారు. భారత రాజ్యాంగంలో జిల్లాలను గురించి ఎక్కడ కూడా ప్రత్యేకంగా పేర్కొనడం జరగలేదు. కాకపోతే,  ఏది ఏమైనప్పటికీ,

భౌగోళికంగా చిన్నదయినా, పెద్దదయినా పౌర పరిపాలనకు క్షేత్ర స్థాయిలో ఒక కీలకమైన కేంద్ర బిందువుగా, అనేక పరీక్షలకు, ఆటుపోట్లకు తట్టుకుని, కాలానుగుణంగా కొన్ని

మార్పులకు లోనవుతూ, నిలదొక్కుగోగలిగింది జిల్లా.  వర్తమాన గణంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం వున్న సుమారు 6,40,000 గ్రామాలను దేశంలోని 683 జిల్లాలతో

భాగించి చూసినట్లయితే అటు-ఇటుగా జిల్లాకు వెయ్యి గ్రామాలే వుంటాయి. తెలంగాణలో కూడా ఇప్పుడున్న 10,761 గ్రామాలు సగటున వెయ్యి గ్రామాల వంతున మొత్తం

పది జిల్లాలలో వ్యాపించి వున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే సరాసరిన, ప్రతి 500 గ్రామాలకు ఒక జిల్లా వుండబోతుంది. జిల్లా పరిపాలన, ప్రాథమికంగా మూడు లేదా

నాలుగు అంచెల్లో వుంటుంది.  మొదటి అంచె జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో, ఇతర జిల్లా స్థాయి అధికారుల సహాయంతో జరుగుతుంది. రెండవ స్థాయిలో సబ్‌ డివిజన్‌ లేదా

రెవిన్యూ డివిజన్‌ ద్వారా, మూడవ స్థాయిలో తహసీల్‌ లేదా మండలం ద్వారా పాలన జరుగుతుంది. అట్టడుగు స్థాయి లేదా క్షేత్ర స్థాయిలో గ్రామం యూనిట్‌గా వుంటుంది.

గ్రామం జిల్లా పరిపాలనలో ముఖ్య భూమిక వహించేది భూసంస్కరణలు, భూముల దైనందిన వ్యవహారం, భూ సేకరణ  భూముల రికార్డులు, భూమి శిస్తు. భూముల

అజమాయిషీ-నిర్వహణలో భాగంగా ప్రభుత్వ భూములను కాపాడడం, వాటిని పరిరక్షిస్తూనే సద్వినియోగ పరచడం, వ్వవసాయానికి ఉపయోగపడని బంజరు భూములను

కాపాడడం, అటవీ భూముల సంరక్షణ, నీటి మార్గాల నిర్వహణ తదితర అంశాలుంటాయి. జిల్లా పరిపాలనలో భూముల వ్యవహారమే కాకుండా వ్యవసాయ సంబంధమైన

అంశాలు, నీటి పారుదల, పరిశ్రమలు, పౌరసరఫరా, రవాణా, సమాజాభివృద్ధి కార్యక్రమాలు, సహకార సంఘాలు, విద్య, వైద్యం, సంక్షేమం, విపత్తులు, ఎన్నికల నిర్వహణ,

స్థానిక సంస్థలు తదితర వ్యవహారాలకు సంబంధించిన పాలనా వ్యవహారాలు కూడా వుంటాయి. వీటన్నింటి కన్నా ప్రధానమైంది కార్య నిర్వహణా బాధ్యతలు.... వీటికి

సంబంధించిన ప్రభుత్వ పరమైన వ్యవహారాలను, ఉన్నత స్థాయిలో, ఏకైక వ్యక్తిగా నిర్వహించేది జిల్లా కలెక్టర్‌.
కలెక్టర్ల అధికారాలు-విధులు-బాధ్యతలు ప్రస్తుతం రెండు రకాలుగా వున్నాయి. ఒకటి నియంత్రణాధికారాలు కాగా, మరొకటి, సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాల అమలు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలైన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు,

దళితులకు భూ పంపిణీ, హరితహారం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు చేయటం లాంటివి వున్నాయి.

2014 జూన్2 న ఆవిర్బవించిన తెలంగాణా రాష్ర్టంలో రాజదానీ ప్రాంతాన్ని కలుపుకొని మెత్తం పదిజిల్లాలున్నాయి.  దాదాపు  లక్షా పదిహేనువేల చదరపుకిలోమీటర్ల విస్తీర్ణంలో

పద్దెనిమిది వేయిల కిలొమీటర్లపైగా విస్థీర్ణంతో మహాబూబ్ నగర్ జిల్లా మెదటి స్థానంలో ఉండగా, 217 కిలోమిటర్లతో హైదరాబాద్ పదోస్థానంలో ఉంది, కానీ జన సాంద్రత

పరంగా 2011 జనాబా లెక్కల ప్రకారం చదరపు కిలోమీటరుకు 170 మందితో అదిలాబాద్ తక్కువ జనబా కలిగిఉండగా, అదే చదరపు కిలోమీటరుకు దాదాపు పంతొమ్మిది

వేల మందితో విశ్వనగరం జనసాంద్రత పెరిగిపోతుంది, దాదాపుగా దేశ జనాబాలో యాబై శాతం జనాబా 684 జిల్లాల్లో కేవలం 150 జిల్లాల్లోనే కేంద్రీక్రుతం కావడం చూస్తుంటే

పట్టణీకరణ ఎలా పెరిగిపోతుందో అర్థమవుతుంది. దీనికి హైదరాబాద్ నగరం కూడా మినహాయింపు కాదు, హైధరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో పాటు పారిశ్రామికంగా,

విద్యా, వైద్య పరంగా అభివ్రుద్ది ఏకీక్రుతం కావడం కూడా దీనికి ప్రదాన కారణం,

జిల్లాల విభజన అనేది ప్రస్తుతం ఉన్న డిమాండ్ కాదు గత పదిహేను సంవత్సరాలుగా వివిద సందర్భాల్లో ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది, చాలా జిల్లా కేంద్రాలు పల్లెలకు

అందుబాటులో లేకపోవడం, జిల్లాల విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో అభివ్రుద్ది ప్రక్రియ మందగించడం, ముఖ్యంగా వ్యవసాయాదారితమైన గ్రామీణ భారతానికి ప్రభుత్వ పరమైన

పర్యవేక్షణ, సరైన తోడ్పాడు లేకపోవడం వలన నూతన జిల్లాల డిమాండ్ అదికమైంది దీనికి తోడు కొన్ని రాజకీయ పరమైన కారణాలు కూడా ఇతోదిక పాత్రని పోషించాయి,
తెలంగాణాలో టీఆర్ఎస్ అదికారాన్ని చేపట్టన నుండే నూతన జిల్లాల ఏర్పాటు తథ్యం అనే సంకేతాల్ని ఇస్తూ వచ్చింది, ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 43 రెవెన్యూ డివిజన్లు,

457 మండలాలున్నాయి,  అయితే ఆంద్రప్రదేశ్ పునర్వవస్తీకరణ బిల్లులో పేర్కొన్నట్టుగా నియేజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పుడున్న 119 నియేజకవర్గాల స్థానంలో

140 నుండి 180 వరకూ పెరిగితే తదనుగుణంగా నూతన జిల్లాల్ని ఏర్పాటు చేయాలని భావించిన, కేంద్రం నుండి నియేజకవర్గాల పునర్విభజనకి సంభందించి లేటవ్వచ్చనే

సంకేతాల నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్బావ దినమైన జూన్2 న కొత్త జిల్లాల ప్రకటన చేయాలనే సంకల్పంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తొంది, దానికనుగుణంగానే  సీఎస్ రాజీవ్ శర్మ

చైర్మన్ గా కమిటీని నియమించింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ BR మీనా, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్

పీటర్ సభ్యులుగా… CCLA స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హాను కన్వీనర్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఈ కమిటీ జూన్2లోగా జిల్లాల ఏర్పాటుకు

సంభందించిన కసరత్తుని ముగించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి, కేసీఆర్ అనుకుంటున్నట్టుగా మెత్తం 24

జిల్లాలతో తెలంగాణా కొత్తగా మారబోతుంది ప్రస్తుతం ఉన్న జిల్లాలను విభజిస్తూ కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉంది.
 సికింద్రాబాద్ Contonement, కందుకూరు, మల్కాజ్గిరి, మేడ్చల్ నియేజకవర్గాలతో సికింద్రాబాద్ జిల్లా
, Bhuvanagiri, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహింపట్నంలతోHyderabad తూర్పు జిల్లా:
 జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, Patancheru, Sherlingampalli, Kutbullapur లతో Golconda జిల్లా:
 చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా, కార్వాన్, మహేశ్వరం నియేజకవర్గాలతో Charminar జిల్లా
ఇక Hyderabad సెంట్రల్ జిల్లాలో నాంపల్లి, Ghoshamahal, Khairtabad, అంబర్పేట్, ముషీరాబాద్ నియేజకవర్గాలనీ,
Nizamabad జిల్లా పరిదిలోకి నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ Rular, Armoor, బాలకొండ, Bhodan లను మాత్రమే ఉంచాలని,
KarimNagar జిల్లా కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి, Huzzurabad నియేజకవర్గాలని ఉంచి మిగతా వాటిని
Jagityal జిల్లాగా ఏర్పాటు చేస్తూ Jagityal, Korutla, వేములవాడ, హుస్నాబాద్, Dramapuri నియేజకవర్గాలని కలుపాలనీ
వరంగల్ల్ ప్రోపెసర్ జయశంకర్ సర్ పేరుతో Bhupalapalli జిల్లానీ ఏర్పాటు చేసి Bhupalapalli, మంథని, Mulugu, Narasampetaలని దాని పరిదిలోకి తేవాలని,
.జనగాం కేంద్రంగా,జనగాం, Mahabubad, స్టేషన్ Ghanapur, డోర్నకల్ లతో మరో జిల్లాను ఏర్పాటు చేయాలని
ఇక  వరంగల్ జిల్లాలో Waranagl పశ్చిమ, Waranagal తూర్పు, Palakurti, Wardanapet, Parakala లు మాత్రమే ఉంచేలా.
 మంచిర్యాల జిల్లాలోమంచిర్యాల, సిర్పూర్, KhagajNagar, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్లతో ఏర్పాటు చేసి
ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, Bainsa, Bhode, ఖానాపూర్ లను మాత్రమే ఉంచనున్నారు,
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మదిర, పాలేర్, వ్యర, ఎల్లందులని మాత్రమే ఉంచి నూతనంగా Badrachalam జిల్లాని Badrachalam, పినపాక, అస్వరాపేట, Sattupalli,

Kottagudemలతో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి,
ఇక  నల్గొండ జిల్లాని రెండు బాగాలుగా చేసి  నల్గొండ, Nakirikel, Munugodu, దేవరకొండ, Nagarjunsagar లతో నల్గొండా జిల్లాని పరిమితం చేసి మరో జిల్లాగా
సూర్యాపేటని ఏర్పాటు చేసి సూర్యాపేట, కొడాద్, మిర్యాలగూడ, HuzzurNagar, Tungaturti నియేజకవర్గాలని దీని పరిదిలోకి తేనున్నారు,
మహబూబ్నగర్ జిల్లాని మూడు భాగాలుగా విభజించి మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల, Maktal, Devakadraలతో మహబూబ్నగర్ని
నాగర్కర్నూల్ కేంద్రంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచంపేట్, కొల్లాపూర్ లతో నాగర్ కర్నూల్ జిల్లా,
మరో జిల్లాగా వనపర్తి, గద్వాల, Aalampur, Narayanapeta, కోడంగల్ నియేజకవర్గాలతో వనపర్తి జిల్లాని ఏర్పాటు చేయనున్నారు.
మెదక్ జిల్లాలో మెదక్, యెల్లారెడ్డి, Bhansuwada, కామారెడ్డి, జుక్కల్ నియేజకవర్గాలతో ఉంచి
సిద్దిపేట ని జిల్లా కేంద్రంగా మార్చను్న్నారు ఇందులో సిద్దిపేట, Dubbaka, Gjawel, మానకొండూర్లతో పాటు ప్రస్తుత కరింనగర్ లోని  Siricilla నియేజకవర్గాన్ని కలుపాలనేది

ప్రతిపాదన మరో జిల్లాగా  సంగారెడ్డిని అప్ గ్రేడ్ చేస్తూ సంగారెడ్డి, Jaheerabad, అన్దోలె, NarayanKed, నర్సాపూర్ నియేజకవర్గాలని ఇందులో ఉంచనున్నారు.
ఈ రకంగా మెత్తం 24 జిల్లాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించి జూన్2న ప్రకటన చేయనుంది.
ఇందుకు కేంద్రం నుండి కూడా సానుకూల సంకేతాలు అందినట్టు తెలుస్తొంది,అందుకనుగుణంగానే ప్రస్తుతం కేంద్రం 44 మంది ఐఏఎస్, 30 మంది ఐపీఎస్, 13 మంది పారెస్ట్

అదికారుల్ని కేటాయించింది అయితే వాస్తవానికి మెత్తం 210 పై చీలుకు కేంద్ర స్థాయి అదికారుల్లో ప్రస్తుతం 30 మంది అదికారుల లోటుతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుంది,

మిగతావారిని కూడా విడతల వారీగా కేటాయిస్తామనే హమీ సైతం కేంద్రం నుంచి దక్కింది.

అయితే కేవలం జిల్లాలను ఏర్పాటు చేస్తేనే సరిపోదు దీనిలో రాజ్యంగబద్దమైన అనేక చిక్కుముడులు ఉన్నాయి, ప్రస్తుతం రాష్ట్రంలో 2018 నుండి 2020 వరకూ అదికారంలో

కొనసాగే వివిద పంచాయతీరాజ్, జడ్పీ, మున్సిపల్, నగర కార్యవర్గాలు కొనసాగుతున్నాయి రాజ్యంగ బద్దంగా వాటికి సంక్రమించిన అదికారాన్ని తీసివేసే అర్హత రాష్ర్ట

ప్రబుత్వానికి లేదు దీనితో కొత్తగా ఏర్పడే జిల్లాలకు తోడు మండలాలు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయాల్పి ఉంటుంది అలాంటి పక్షంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న
స్థానిక ప్రభుత్వం పరిదిని మార్చాల్సి ఉంటుంది దానికి తోడు వాటి రిజర్వేషన్ల దామాషాలు ఉండనే ఉన్నాయి ఇన్ని చిక్కుముళ్ల మద్య గతంలో ఎన్టీఆర్ హయాంలో కొత్త

మండల వ్యవస్థని ఏర్పాటు చేసిన రెండెళ్ల తర్వాత కానీ అదికారికంగా ఉనికిలోకి రాలేదు, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు మండల కేంద్రాలను రెవన్యూ

డివిజన్లను నగర పంచాయితీలను కూడా పెంచాల్సి ఉంది.

మరో చిక్కుముడి రాష్ర్టవ్యాప్తంగా వివిద ప్రాంతాల్లో కొత్త జిల్లాల డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి, గత రెండు సంవత్సరాలుగా స్థబ్దుగా ఉన్న తెలంగాణా మరోసారి ఉద్యమాలకు

సంసిద్దమౌతుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఉద్యమాలు వేడెక్కుతున్నాయి. వరంగల్‌ జిల్లాలో మానుకోట జిల్లా కోసం అఖిలపక్షం రైల్‌రోకో నిర్వహించింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌

రైలు ఫ్లాట్‌ఫాంపైకి వస్తుండగా దూసుకువచ్చారు. మునిసిపాలిటీలో సీపీఐ కౌన్సిలర్లు ప్లకార్డులు, నల్ల జెం డాలతో బైఠాయించారు. సమ్మక్క-సారలమ్మ పేరిట ములుగు జిల్లా

కోరుతూ చేపట్టిన 48గంటల బంద్‌ విజయవంతమైంది. కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి జేఏసీ నేతలు నిర్ణయించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరిట జిల్లా కోసం భూపాలపల్లిలో

కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఒక్కరోజు దీక్షను చేపట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల జిల్లా కోసం జిల్లా సాధన విద్యార్థి పోరాట

సమితి చేపట్టిన ఆమరణ దీక్షలు చేశారు.  నేతలు ఆర్డీవో ఆఫీసుముందు ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో బెల్లంపల్లి జిల్లాకోసం సోమగూడెం చౌరస్తావద్ద రిలేదీక్ష

చేపట్టారు. బెల్లంపల్లిని బొందల గడ్డలుగా మార్చి జీవన విధ్వంసం సృష్టించేందుకే ప్రభుత్వం బెల్లంపల్లి జిల్లాను తెరపైకి తేవడం లేదని వారు ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లాలో

మంథని జిల్లా కోరు తూ నిర్వహించిన 48గంటల బంద్‌ విజయవంతమైంది. మూడు జిల్లాల సరిహద్దులోగల హుస్నాబాద్‌ను జిల్లా చేయాలంటూ లోక్‌సత్తా ఆధ్వర్యంలో రౌండ్‌

టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రామగుండం జిల్లా ఏర్పా టుకోసం రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భువనగిరిజిల్లాలో ఇబ్రహీంపట్నం వంటి నియోజ కవర్గాలను

కలిపితే ప్రతిఘటిస్తామని ఇబ్రహీంపట్నం జిల్లా సాధన సమితి ప్రకటించింది. ఇలా ఉద్యమాలు వివిద ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు 14 కొత్త

జిల్లాల అవసరం లేదనే సామాజిక వేత్తలు కూడా ఉన్నారు, పరిపాలనా సౌలబ్యం కోసం రెండు మూడు జిల్లాలను పెంచితే సరిపోతుందనేది వారి వాదన తద్వారా గవర్నమెంట్

ఆపీసుల్లో పెరిగే దుబారాతో పాటు ఒక్కో జిల్లా ఏర్పాటుకు అవసరమయ్యే 100కోట్ల నిదులని వేరే రంగాలకి ఉపయేగించవచ్చనేది వారి సూచన.

ఏది ఏమైనా పరిపాలనా సౌలబ్యం కొసం జిల్లాల పెంపు సమర్థనీయమైనదే కానీ అదే ముసుగులో రియల్ దందా స్వైర విహారాన్ని కూడా అరికట్టాల్సిన బాద్యత సర్కార్

మీదుంటుంది, ఏతావాతా పరిశ్రమలు పెరిగి ఉపాది అవకాశాలు మెరుగైనప్పటికీ, పెంపుదల వల్ల కలిగే పెనుభారం నుండి సామాన్యున్ని కాపాడాల్సిన కర్తవ్యాన్ని ప్రబుత్వాలు

బుజాన కెత్తుకోవాలి, ఏదో ఇష్టారీతిన కాకుండా పటిష్టమైన వ్యవస్థలో సమగ్రమైన వివరాలతో అన్నిరకాలుగా ఆమెద యేగ్యమైన జిల్లాల ఏర్పాటును ప్రతీ ఒక్కరూ

స్వాగతిస్తారనేది కాదనలేని వాస్తవం.





1 Comments:

At May 21, 2016 at 1:14 AM , Anonymous Anonymous said...

nice information

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home