రియే ఒలింపిక్స్ 2016, ఇండియా ఇట్స్ ఎబిలిటీ
రియే ఒలింపిక్స్ 2016, ఇండియా ఇట్స్ ఎబిలిటీ
క్రీడలు ప్రపంచ స్నేహ వారదులు అన్న నెల్సన్ మండెలా స్పూర్తిని నిజం చేస్తున్నాయి ఆదునిక ఒలింపిక్ గెమ్స్, ఆగస్లు 5 నుండి 21 వరకూ పదహారు రోజుల పాటు ప్రపంచ క్రీడాబిమానుల్ల్ని, ఆ మాటకొస్తే యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడానికి బ్రెజిల్ లోని రియేడిజనేరో నగరం వేదిక కానుంది, పదహారు రోజుల పాటు జరిగే ఈ సంరంబంలో దాదాపు 206 దేశాల నుండి ఇంచుమించుగా 10500 మంది క్రిడాకారులు 306 క్రీడల్లో 41 విబాగాల్లో పోటీ పడబోతున్నారు, 2012 లండన్ ఒలింపిక్స్ఖ్ తరువాత ఇప్పుడు బ్రెజిల్ లోని సాంబా న్రుత్యాల మద్య కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల జిలుగుల్లో బ్రేజిల్ సాంప్రదాయాలకు అనుగుణంగా అగస్టు 5 వతేదీన జరిగే క్రీడా సంరంబం యావత్ ప్రపంచాన్ని ఉర్రూత లూపబోతుంది.
ఇంతటి ఘనమైన గేమ్స్ ప్రపంచం మెత్తాన్ని ఒక్కటి చేసే ఈవెంట్ ఒక్క క్రీడల్లోనే కాదు ఏ రంగంలోనూ దీనిని మించింది లేదు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర కూడా చాలా పెద్దది, ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగేళ్ళకొకసారి జరుగుతాయి. క్రీ.పూ.776 లో ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు క్రీ.శ.393 లో నిలిపి వేసారు.క్రీ.పూ. 8 వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం అనేక రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. గ్రీకు రాజ్యాల మధ్య తరుచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. శాంతి సామరస్యాలకు క్రీడలు పరిష్కారం చూపుతాయని గ్రహించిన గ్రీకులు క్రీ.పూ.776 లో మొదటిసారిగా ఈ క్రీడలను నిర్వహించారు. అప్పటినుంచి క్రీ.శ.393 వరకు ప్రతి నాలుగేళ్ళకోసారి ఒలింపిక్ క్రీడలు సాఫీగా నిర్వహించారు. క్రీడోత్సవాల సమయంలో యుద్ధాలు కూడా ఆపేవారు. క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఆలివ్ కొమ్మలను బహుమతిగా ఇచ్చేవారు, అప్పట్లో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు జూలై నెలలో జరిగేవి. ప్రారంభంలో 9 క్రీడాంశాలతో ఒక రోజు మాత్రమే నిర్వహించేవారు కాని కాలక్రమేణా జనాదరణ పెరగడంతో పోటీలు నిర్వహించే రోజుల సంఖ్య, క్రీడాంశాల సంఖ్య పెరుగుతూ పోయింది. ఆ రోజుల్లో క్రీడలు జరుగుతున్నన్ని రోజులు తమతమ ప్రజలు పనులు కూడా ఆపివేసి ఒలింపియా స్టేడియానికి పరుగులు పెట్టేవారు. క్రీడాంశాలలో పరుగు పందెంతో పాటు, కుస్తీ, రథాల పోటీ, బాక్సింగ్, గుర్రపు స్వారీ మున్నగు పోటీలు జరిగేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి క్రీ.శ.393లో ఈ ఒలింపిక్ క్రీడలను నిషేధించాడు. ఆ తరువాత ఒలింపస్ పట్టణం వరదలు, భూకంపాల కారణంగా కాలగర్భంలో కలిసిపోయింది. మళ్ళీ క్రీ.శ. 1896 లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మధ్యలో కొంతకాలం ప్రపంచయుద్ధాల వల్ల అంతరాయం ఏర్పడిననూ, దాదాపు నాలుగేళ్ళకోసారి ఈ ఒలంపియాడ్ మహా క్రీడలు జరుగుతున్నాయి. ప్రాచీన కాలంలో జరిగిన క్రీడలను ప్రాచీన ఒలింపిక్ క్రీడలు గా, పునఃప్రారంభం తరువాత జరుగుతున్న క్రీడలను ఆధునిక ఒలింపిక్ క్రీడలుగా వ్యవహరిస్తారు.ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్యకారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరె డి కోబర్టీన్. మరుగున పడిన ఒలింపిక్ క్రీడలకు తిరిగి జీవం పోసిన ఘనత ఈయనకే దక్కుతుంది. కాబట్టి ఇతడు ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా ప్రసిద్ధి చెందినాడు. కోబర్టీన్ 1892లో ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని ప్రకటించాడు. క్రీడల పున:ప్రారంభానికి అతడు విపరీతంగా కృషి చేశాడు. అతడి పట్టుదల మూలంగా 1896లో మొదటిసారిగా ఎథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు మరుగున పడిన ప్రదేశంలోనే తొలి ఆధునిక క్రీడలు నిర్వహించుట విశేషం. ఆ తరువాత 6 ఒలింపిక్ క్రీడలు జరగగానే 1916లో బెర్లిన్ లో జరగాల్సిన క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. మళ్ళీ 1940, 1944లలో జరగాల్సిన హెల్సింకీ, లండన్ ఒలింపిక్ క్రీడలు కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. అలాగే రాజకీయ కారణాల వల్ల అప్పుడప్పుడు కొన్ని దేశాలు బహిష్కరిస్తున్నాయి. హంగేరీ మీద సోవియట్ యూనియన్ దాడికి నిరసనగా 1956 మెల్బోర్న్ ఒలింపిక్ క్రీడలను హాలెండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలు బహిష్కరించాయి. వర్ణవివక్షత పాటిస్తున్న కారణంగా 1964 నుంచి చాలాకాలం పాటు దక్షిణాఫ్రికా ఈ క్రీడలలో పాల్గొనడాన్ని నిషేధించారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్ క్రీడలను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. 1980 మాస్కో ఒలింపిక్ క్రీడలలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు పాల్గొనలేదు. తత్ఫలితంగా 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను రష్యా, దాని మిత్ర దేశాలు బహిష్కరించాయి. ఈ విధంగా దేశాల మధ్య స్నేహ సంబంధాల కోసం ప్రారంభించిన క్రీడలు అపుడప్పుడు దేశాల మధ్య వైషమ్యాలు కూడా పెంచాయి 1924 నుంచి శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 30 వేసవి ఒలింపిక్ క్రీడలు జరుగగా, 29 వ ఒలింపిక్ క్రీడలు 2008 లో చైనా లోని బీజింగ్ లో జరిగాయి. 2012 లో 30వ సమ్మర్ ఒలింపిక్స్ లండను లో జరిగాయి. 2016 అగస్లు 5 నుండి రియేలో ప్రారంబం కాబోతున్న క్రీడలు 31 వ సమ్మర్ ఒలింపిక్ క్రీడలు,
దాదాపుగా విశ్వాన్ని ఒక్కటి చేస్తున్న ఒలింపిక్ గెమ్స్ సింబల్ కూడా దీనికి ప్రతీకగా నిలుస్తుంది ఒకదానితో ఒకటి గొలుసువలె కలిసిన ఐదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా,అమెరికా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు, . ఐదు రింగులు వరుసగా నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఐదు రింగులు ప్రజల క్రీడా స్ఫూర్తికి సౌభ్రాతృత్వానికి చిహ్నం, ఒలింపిక్ పతాకం క్రీస్తుశకం 1913లో బేరన్ పియరీ డీ కౌబర్టీన్ సలహాపై రూపొందించబడి, క్రీస్తుశకం 1914లో పారిస్లో ఆవిష్కరింపబడింది. అయితే క్రీ.శ. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో ప్రప్రథమంగా ఎగుర వేయబడినది. ఒలింపిక్ పతాకం తెల్లని పట్టుగుడ్డ మీద ఒకదానితో ఒకటి కలిసిన ఐదు రింగులు ఉంటాయి.
ఇంకా అనేక ప్రత్యేకతలున్న ఒలింపిక్స్లో అత్యంత ముఖ్యమైన విషయం ఒలింపిక్ టార్చ్ ది, ప్రాచీన గ్రీసులో లైట్ సూర్యుని ప్రతిరూపంగా భావించేవారు, ప్రాచీన గ్రీసుదేవాలయాల ముందు వారి దేవుడు హెస్టియా, ప్రోమేథీస్ ప్రతిరూపం గా బావించి పంచభూతాల మిలితంగా ఈ లైట్ని వెలిగించేవారు అదే అనవాయితీ ఈ విశ్వ క్రీడల్లో కూడా కొనసాగింది అయితే అదునిక ఒలింపిక్స్లో మెదటినుండి టార్చ్ రిలే అనేది లేదు 1928 అమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్లో మల్లీ టార్చ్ మెదలైంది కానీ నగరం మద్యలో స్టేడియమ్ ముందు మారథాన్ టవర్లో జ్వాల రూపంలో ఒలింపిక్ లైట్ని వెలిగించినా, ప్రాచీన గ్రీసు ప్రాంగణం నుండి ఒలింపిక్ నగరానికి రిలేగా మెదలైంది మాత్రం 1936 బెర్లిన్ ఒలింపిక్స్ నుండే అని చెప్పుకోవచ్చు, కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ టార్చ్ రిలేలో కొన్ని దేశాలు నిరసన వ్యక్తం చేయడంతో టార్చ్ రిలేతో పాటు ఒలింపిక్స్ గేమ్స్ మూల కారణమైన ప్రపంచ స్నేహా సంబందాలు దెబ్బతింటాయనే ఉద్దేశ్యంతో 2012 లండన్ ఒలింపిక్స్ నుండి కేవలం ఆతిథ్య దేశంలో మాత్రమే టార్చ్ రిలే నిర్వహిస్తున్నారు,
పతకాల విషయానికొస్తే ఒలింపిక్స్లోలో పాల్గొనడం క్రీడాకారుడు ఎంత గౌరవంగా భావిస్తాడో, పతకాలు సాదించడాన్ని ఆ దేశం అంతకంటే ఎక్కువ గౌరవంగా భావిస్తుంటుంది, ఒకానొక
సందర్భంలో ప్రచ్చన్న యుద్ద కాలంలో అమెరికా రష్యాల మద్య అదిపత్య పోరు ఎంతగా ఉండిందంటే ఒలింపిక్స్ పతకాల్లో అగ్రస్థానం కొసం తమ తమ దేశ అథ్లేట్లకి విపరీత శిక్షణని కూడా ఇచ్చాయి, ఈజాడ్యమే నేటి డోపింగ్ ల్లో దోషులుగా నిలబడే హీన స్థితికి క్రీడాకారుల్ని తీసుకెళ్లాయి, (బ్రదర్స్ సినిమా క్లిప్ వేయాలి)
ఒలింపిక్ చరిత్రలో అనేక స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు కూడా ఉన్నారు. లారిస్సా లాటినినా అత్యధికంగా 9 స్వర్ణాలతో మొత్తం 18 ఒలింపిక్ పతకాలను సాధించగా 9 స్వర్ణాలు సాధించిన మరో ముగ్గురు క్రీడాకారులు కూడా ఉన్నారు. 1972లో స్విమ్మింగ్‌లో ఒకే ఒలింపిక్స్‌లో - ఒకటి కాదు రెండు కాదు - ఏకంగా ఏడు స్వర్ణాలు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు మార్క్ స్పిట్జ్. తన క్రీడాజీవితంలో మొత్తం 9 స్వర్ణాలు సాధించాడు. ఒకే ఒలింపిక్ పోటీలలో అత్యధిక స్వర్ణాలు సాధించిన రికార్డు ఇప్పటికీ మార్క్ స్పిట్జ్ పేరిటే ఉంది.
ఉక్రెయిన్‌కు చెందిన బుబ్కా . పోలోవాల్ట్‌లో మకుటం లేని మహారాజుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించినా ఒలింపిక్స్‌లో కేవలం ఒకే స్వర్ణం సాధించటం గమనార్హం
మన దేశం విషయానికి వస్తే భారతదేశం తొలి సారిగా 1900 పారిస్ ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు ఆంగ్లో ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ ఆ ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించాడు. 1920లో తొలిసారి భారత్ జట్టును ఒలింపిక్ క్రీడలకు పంపినది. అప్పటి నుంచి ప్రతి వేసవి ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఇప్పటివరకు భారత్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో 24 పతకాలు సాధించిపెట్టారు. అందులో అత్యధికంగా మైదాన హాకీలో సాధించినవే. 1928 మరియు 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడలలో 11 పతకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. మొత్తంపై ఒలింపిక్ క్రీడలలో భారత్ 9 స్వర్ణ పతకాలను సాధించగా అందులో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా మరో స్వర్ణపతకం 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో షూటింగ్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు, అదే ఒలింపిక్స్లలో రెజ్లింగ్, బాక్సింగ్లో ఒక్కో కాంస్య పతకం లబించింది, వ్యక్తిగత విబాగాల్లో 1900ల్లో నార్మన్ ప్రిచర్డ్ అథ్లేటిక్స్లో రెండు రజతాల్ని సాదించగా దాదాపు 50సంవత్సరాల తర్వాత 1952 హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్ లో కేపీ జాదవ్ రెజ్లింగ్లో మూడోస్తానాన్ని సాదించాడు, ఆతర్వాత ఇంచుమించు అరశతాభ్దం దగ్గర్లో 96అట్లాంట గేమ్స్లో లియాండర్ పేస్ టెన్నిస్లో కాంస్యాన్ని సాదించాడు, 2000లొ తెలుగు తేజం కరణం మల్లీశ్వరి వెయిట్ లిప్లింగ్లో కాంస్యాన్ని, 2004లో షూటింగ్లో రజతంతో సరిపెట్టాడు నేటి కేంద్ర మంత్రి రాజ్యవర్గన్ రాథోడ్, ఇక 2012 లో నాలుగు పతకాలు సాదించిన భారత టీం ఈ ఒలింపిక్స్లో నైనా భారీ పతకాల్ని తేవాలని సగటు భారతీయుని కోరిక,
అనేక అంశాలలో విశ్వ విజేతలుగా నిలబడుతున్న 100కోట్ల పై చీలుకు భారత సమాజం ఒలింపిక్స్ మెదలైనప్పటి నుండి పేలవమైన పలితాల్నే చూపిస్తుంది, ఒలింపిక్లో మనకి మాత్రమే స్థానమున్న మన జాతీయ క్రీడాహాకీ గత అరశతాబ్దం నుండి కనీసం క్వాలీపయింగ్ కే చెమటోడుస్తుంది,
భారత ఒలింపిక్ క్రీడల వ్యవహారాలను పర్యవేక్షించే భారత ఒలింపిక్ అసోసియేషన్ ను 1927లో స్థాపించినారు సర్ దొరాబ్జీ టాటా అద్యక్షుడుగా, ఏజీ నోహ్రేన్ జనరల్ సెక్రటరీగా మెదటి ఐఒఏ తన విదుల్ని నిర్వహించింది, తొమ్మిదవ కార్వవర్గం సురేశ్ కల్మాడీ అద్యక్షతన ఏర్పాటు కాగా అత్యంత అవినీతి ఆరోపణలతో భారత ఒలింపిక్ సంఘం పరువుని బజారు కీడ్చిందని చెప్పాలి, ప్రస్తుతం ఎన్ రామచంద్రన్ అద్యక్షతలోని ఐఓఏ బారత్ నుండి జంబో టీంను రియే ఒలింపిక్స్ కి పంపుతుంది, ఈ మద్య మనదేశం తరుపున బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని గుడ్విల్ అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమయింది, బహుషా ఈ మద్య వార్తల్లో నలిగిన అత్యంత ముఖ్యమైన అంశంగా మారిన విషయం కూడా ఇదే అయితే భారత ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం గుడ్ విల్ అంబాసిడర్ వల్ల క్రీడల ప్రాచుర్యం పెరుగుతుందని అందుకే వివిద రంగాలకు చెందిన ముఖ్యుల్ని నియమిస్తామని చెపుతుంది సల్మాన్ తో పాటు క్రికెట్ గాడ్ సచిన్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా, అస్కారిస్ట్ ఏ ఆర్ రహ్మన్ని భారత గుడ్విల్ అంబాసిడర్లుగా నియమించింది,
వివాదాలు, ఆక్షేపణలు ఎన్నున్నా ఒలింపిక్స్ లాంటి గేమ్స్ ప్రపంచాన్ని స్నేహపూర్వకంగా మారుస్తాయనడంలో సంధేహం లేదు, బిజీ బిజీగా మారిపోయి ఆర్థిక వ్యవహారాల చుట్టూ తిరుగుతున్న సగటు వ్యక్తికి ఒ పక్షంరోజులు సంపూర్ణమైన మానసిక ఆనందాన్ని ఈ క్రీడలు కలుగజేస్తాయి, అలాగే 120 కోట్లకు పైగా ప్రజల ఆశల్ని మోస్తున్న మన క్రీడాకారులు ఆ కలల్ని నిజం చేయాలని మనస్పూర్తిగా మనమూ కోరుకుందాం,
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home