POLITICAL GAMES
రాజకీయాన్ని క్రీడా అంటారు, చాలా మందికి పాలిటిక్స్ అంటే సేవ కదా మరి దాన్ని (ఊసుపోక ఆడేదైనా దేశం కోసం ఆడేదైనా). క్రీడలతో పోల్చడం ఏంటీ అనే ధర్మ సందేహం కలగొచ్చు కాని దేశ రాజకీయాల్ని ప్రత్యేకించి మన రాష్ట్ర రాజకీయాల్ని గమనిస్తే ఆ సందేహం తీరొచ్చు.
చాలా రోజులుగా వివిదరకాలుగా ఎన్నో విపరీత పరిణామాలు సంబవిస్తూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి, మన కథా సంగ్రహణ విషయానికొస్తే సెప్టెంబర్2 వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రాన్ని రాజకీయాలు నడిపిస్తున్నాయనేది కాదు కాదు రాజకీయ క్రీడలు నడిపిస్తున్నాయనేది బహిరంగ రహస్యం.
మొదటి అంకానికొస్తే అక్కడా ఇక్కడా తామే అదికారంలో ఉన్నా ఎవరిని ఉంచాలి, ఎవరిని తుంచాలి అనేది తెలియక తలలు పట్టుకునే విదంగా తయారుచేసుకున్న కాంగ్రెస్ తికమకలో వేసిన మెదటి ఎత్తు రోశయ్యని సీఎం చేయడం, కాని ఘన చరిత్ర ఉన్న పార్టీ నాయకత్వం ఏదో ఏమరపాటుగా ఈస్టెఫ్ వేసి ఉంటుందా? అంతవరకు కొరకరాని కొయ్యగా తయారైన వైఎస్ (అంతా తన కనుసన్నల్లో జరిపించే నేతగా ఉన్న పేరు)ని ఆయన చరిష్మాని తొలగించి యదా గాంది ప్యామిలీకి పూర్వవైభవం తేవాలంటే తదా పాత కాంగ్రెస్‌ని స్థాపించాలనే నిజాన్ని అదిష్టానం గుర్తించిందనే వారు కూడా ఉన్నారు. ఈ స్టెప్ కి గిల గిలా కొట్టుకున్న జగన్‌మెహన్ రెడ్డి తర్వాత వేయని ఎత్తు లేదు గీయని స్కెచ్చూలేదు. ఇది మెదటి అంకంలోని కీలక పరిణామం దీనికి కొనసాగింపు చూసేముందు కాంగ్రెస్ పార్టీ వేసిన రెండో ఎత్తేంటో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రత్యేక వాదమే నినాదంగా ప్రతీ పరిస్థితిని ఆచితూచి అంచనా వేసే టీఆర్‌ఎస్ కేసీఆర్ రాజకీయ చదరంగంలో రెండో ఎత్తు వేశాడని చెప్పుకొవచ్చు, ఎందుకంటే నవంబర్ 28న ఆయన ప్రారంబించిన నిరాహరదీక్ష తదనంతర పరిణామాలకు ఏ ఎత్తు వేయాలో అర్థం కాని 125ఏళ్ల కాంగ్రెస్ చిత్తుచిత్తుగా దిగొచ్చి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి చిదంబరంతో చేయించిన తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఈ క్రీడని కీలక మలుపు తిప్పిందనే బావించవచ్చు, ఈ సందీ దశలో కేంద్రం వేచిన పాచిక నచ్చని ఒక ప్రాంతం నేతలు ఇక్కడ ఆడిన ఆట మరో కురు క్షేత్రాన్ని తలపించిందనే చెప్పోచ్చు ఎందుకంటే అదినాయకత్వం పైనే దిక్కార స్వరంతో గద్దించిన లగడపాటి ఏసీ కారులో విజయవాడ నుండి బయల్దేరి బుల్లి ఆటోలో నిమ్స్‌లో చేరిన దగ్గరినుండి ఆ టీం ఈ టీం అనే తేడాలేకుండా కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ అందరూ హుటాహుటీన స్పీకర్‌ని కలిసి వేసిన రాజీనామా పాచిక వరకు ఆటలో ఒక అంకమైతే, జట్టుగా కాకుండా అవసరాలుగా జట్టులు కట్టి విడివిడిగా వడివడిగా ఆడిన ఆటకి నిజంగా తెలుగు ప్రజలు చిత్తయే ఉంటారు సారీ సారీ థ్రిల్లయే ఉంటారు. రాజీనామాలు ఉప ఎన్నికలు, సవాల్లు ప్రతి సవాల్లు, ఉద్యమాలు తాకట్టులు ఒకటేమిటి చిన్నప్పుడు పెద్ద బాలశిక్షకూడా నేర్పని తిట్లదండకాల్ని పాపం తెలుగువాళ్లు ఫ్రీగా నేర్చుకున్నారు అయితే పాపం ఈ ఆటలో ఇరుజట్లు సారి సారి ఏ టీంలో ఎవరున్నారొ మెత్తం మీద ఆటగాల్లు ఎత్తులు వేస్తున్నారు, చిత్తయిపోతున్నారు, జనాల ఓట్లతో అదికారం చెలాయిస్తూ మరి వారి భవితకొసం వారి కోసం ఏదో ఒకటి చేయకపోతే ఆటగాళ్లేలా అవుతారు మరి పాపం అందుకే ఆడుతున్నారు...ఆటాడుతున్నారు.
ఇక ప్రస్తుత అంకానికొస్తే మెదటి ఎత్తులోని పొరబాట్లని సరిదిద్దుకుంటూ ఆచి తూచి వేసిన ఎత్తు ఈసారి ప్రేక్షకులతో పాటు ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులకన్నా ఎక్కువగా ఆటగాల్లని బిత్తరపోయేలా చేసిందనుకోవచ్చు, ఎందుకంటే తన మానాన తను ప్లీజ్ సిడైన్, కూర్చొండి, యువర్ టైం ఈజ్ ఓవర్ అనే ఎంపైర్‌ని తీసుకొచ్చి కాప్టెన్ చైర్‌లో కూర్చొబెట్టింది కాంగ్రెస్,
దీంతో మెదటి స్టెప్ నే ఆడిపోసుకునే తమ టీం ఆటగాళ్లు కొందరు ఇంకా రెచ్చిపోయారు, జగన్‌మెహన్‌రెడ్డి కూడా గర్జించడం నుండి గాండ్రించడం వరకు వెల్లాడు ఏకంగా టీం నుంచి బయటకొచ్చి కొత్త టీంని ఏర్పాటుచేశాడు, ఇదే అదనుగా కొత్తగా ఏర్పాటు చేసిన టీంని ఘన చరిత్ర కలిగిన పార్టీలో కలిపేశాడు చిరంజీవి, ఈ ఎత్తులు ప్రేక్షకులు ఊహించినా ఇంతలా రక్తి కట్టేలా పండుతాయని అనుకోలేదు, అయితే బంతి దొరికినప్పుడల్లా బౌన్సర్ వేసే ఫాస్ట్ బౌలర్‌లా జగన్ మనుషులు మెయిన్ టీంనే టార్గెట్ చేయడం, అయినా క్యాప్టెన్ వారిని ఏమనకపోవడం, మద్యలో తమ స్టెప్ప్‌లకి అవకాశం ఇవ్వకపోయినా కేసీఆర్ మిన్నకుండిపోవడం, ఈ లోగా ఆటలో నేనున్నానంటూ టీడీపీ అదినేత దూసుకురావడం, ఇన్నాళ్లు లేని అవకాశం దొరికేసరికి రాజుకి చెక్‌పెట్టేలా అవిశ్వాసం ప్రవేశపెట్టడం, సందులో సడేమియాలా ఆమామ్యాలు, అమాత్యుల మంతనాలు, కోరికల సాదనకి తెరచాటు మంత్రాంగం తన యంత్రాంగంతో చేసే బేరసారం చివరికి చచ్చిచెడి అటో ఇటో ఆట డ్రాగా ముగిసిపోవడం.
ఐతే ప్రేక్షకుడి కొన్ని సార్లు ఉద్విగ్నానికి, కొన్నిసార్లు ఉద్వేగానికి, మరికొన్నిసార్లు నిర్వేదానికి గురికావచ్చుగాక కాని ఆటగాళ్లకు మాత్రం భారి నజరానాలే ముట్టొచ్చు ఎలాగంటే మేయర్ పీఠంతో ఎంఐఎం, విశిష్ట ప్రాధాన్యతతో పీఆర్పీ, ఉపఎన్నికల అవకాశంతో వైఎస్సార్ కాంగ్రెస్,టీడీపీ. మరి టీఆర్‌ఎస్ పరిస్థితి కొంచెం విచిత్రంగానే ఉంది అందివచ్చిన అవిశ్వాసాన్ని కాకలు తీరిన కేసీఆర్ ఎంతమేరకు ఏ రకంగా ఉపయేగించుకున్నాడనేదే సగటు మానవునిగా నా బుర్రకు తట్టని విషయం, ఈ ఒక్క అంశమే కాదు నిశితంగా గమనిస్తే ఇందులోని ప్రతీ అంకంలో ఎవరి ఆట ఏమిటి ఎవరి లాభాలేమిటీ అనేది విజ్జత గల ప్రజలకు భోదపడనిది కాదు, అది 2014లో బయటపడనిదీ కాదు. ఏమంటారు.