clean2politics

for save politics to uncivilized politicians

Wednesday, March 21, 2012

అనుకున్నదే జరిగింది, అనుకున్నప్పటంత ఊపు లేకున్నా అనుకున్నదానికి కొంత బిన్నంగానైనా అనుకున్నదే జరిగింది.
ఏంటీ అనుకోవడం గోల అంటారా. నవంబర్‌ తెలంగాణ ఉద్యమం తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ప్రతీసారి కాంగ్రెస్‌ పెద్దలు చెపుతున్న మాటే ఇది తెలంగాణ గురించి ఇంకా ఏం అనుకోలేదు త్వరలోనే నిర్ణయం అంటూ ఊదరగొట్టిన టెన్‌ జన్‌పథ్‌ అనుయాయులకి భవిష‌్యత్‌పై బెంగపెట్లుకొనే తీర్పుని ఈ రోజు తెలంగాణ ఓటరు ఇచ్చాడు,

మీరు అనుకునేది అనుకుంటూనే ఉండండి, మేం ఏం చేయాలో నిర్ణయించుకొన్నాం అంటూ విస్పష్టమైన తీర్పునిచ్చాడు చెంప చెల్లుమనకుండానే నొప్పి బాదని అనుభవించే అవకాశాన్ని కాంగ్రెస్‌ పెద్దలకి రుచి చూపించాడు, మామూలుగా ఇండిపెండెంట్‌గా గెలిచిన వ్యక్తైనా లేక ప్రతిపక్పాలకు చేందిన వారైనా మీపై చర్యలుండవు అంటే ఎంచక్కా అదికారపార్టీకి మారడానికి ఎదురుచూసే రోజులివి మరలాంటిది అదికారాన్ని వదులుకోవడానికి అందునా మంత్రిపదవిని వదులుకోని మరీ ఉప ప్రాంతీయ పార్టీల్లో చేరుతుంటే 125 ఏళ్ల కాంగ్రెస్‌ ఏం జరుగుతుంది అనేది విశ్లేషించుకోలేని స్గితిలో ఉందా... ఇందాక అనుకొంటున్నట్టుగా ఇంకా సమస్యపై ఏం నిర్ణయాన్ని తీసుకోలేదు అని దాటవేసి దులుపుకుందామనుకుందా.... వారే నిర్ణయించుకోవాలి, తెలంగాణాలోని 6స్థానాల్లో అదిలాబాద్, కామారెడ్డి, ఘన్‌పూర్‌, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్, మహబూబ్‌నగర్‌ లు నెల్లూరు జిల్లా కోవూరు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మిగతా వాటి సంగతెలా ఉన్న మహబూబ్‌నగర్‌, కోవూరులు మాత్రం అదికార పార్టీతో పాటు ప్రదాన ప్రతిప క్షా నికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేసే పలితాలే. సిట్టింగ్‌ స్ఘానాల్లోంచి 4 స్ఘానాల్ని కోల్పోయిన టీడీపీ, 2 స్ఘానాల్ని కోల్పోయి కాంగ్రెస్‌ డీలా పడిపోయాయి, సాదారణంగా ఉపఎన్నికలు ఏ పరిస్ఘితుల్లో జరిగినా మెదటి అర్ఘబాగం కంటే చివరి అర్థబాగం అదికార పార్టీకి కత్తిమీద సామే అయినప్పటికి ఈ అవకాశాన్ని ప్రదాన ప్రతిపక్సం కనీసం ఉపయేగించుకోవడం కాదుగదా తన సీటునే కాపాడుకోలేని స్ఘితిలోకి పోవడం రెండో స్థానానికి కూడా అర్హత సాదించకపోవడం మాత్రం ఓక్క అంధ్రప్రదేశ్‌లో మాత్రమే కనిపించే దృశ్యం, రెండు ప్రదాన పార్టీల పరిస్థితి ఈ విదంగా ఉంటే 10 ఏళ్లుగా ఒకే సిద్దాంతం గురించి వల్లెవేస్తూ తిట్గదండకాలతో, మాటల జిమ్మిక్కులతో, రాజీనామాల ప్రణాళికలతో వ్యూహాత్మకంగా మాట్లాడే తెరాసా కేసీఆర్‌కి కూడా చురకంటించారు, చురకంటే మామూలుగా కూడా కాదు, ఇన్నాళ్లు తెలంగాణ అంటే కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ అనేలా మాట్టాడిన ఆ పార్టీ నాయకులకు మహబూబ్‌నగర్‌ ప్రజలు కళ్లు బైర్లుకమ్మే తీర్పునే వెలువరిచారు, పైపైకి మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తూ బిజేపీ గెలిచినా, టీఆర్‌ఎస్‌ గెలిచినా తెలంగాణా వాదమే గెలించిందన్న కేసీఆర్‌ని రాబోయే ఎన్నికల్లో ఎదురించే శక్తిగా బాజపా అవతరించిందనే సత్యం తెలుసుకోలేనంత అమాయకుడైతే కేసీఆర్ కాదు, ప్రతీ చిన్న మీటింగ్‌కి భాజాపా జాతీయ నాయకులు పోలోమంటూ అంద్రదేశంలో వాలిపోవడం తెలంగాణ ప్రజల పక్షాన గల్లీనుండి డిల్లీ పార్లమెంట్‌లో బలంగా వినిపించడం గత 5ఏళ్లుగా సీరియస్‌గా సమస్యపై ద్రుష్టిపెట్టడం ఈ చర్యలన్నీ వాల్లకు కలిసొచ్చినట్టే కన్పిస్తున్నాయి, ఎలాగంటే ముస్లిం ఓటర్లు అత్యదికంగా ఉన్న మహబూబ్‌నగర్‌ లో సైతం బీజేపీ గెలవడం ద్వార మతతత్వం కన్నా మాకు ప్రత్యేక రాష్ట్రమే ముఖ్యమనే అభిప్రాయాన్ని తెలంగాణ ఓటరు చెప్పకనే చెప్పాడు, మరీ పరిస్థితిని ఇటు బీజేపీ ఏవిదంగా ఉపయేగించుకుంటుంది, కాంగ్రెస్‌ ఏ విదంగా ఎదుర్కుంటుంది, తెరాసా ఎలా నెగ్గుకొస్తుంది, టీడీపీ ఎలా బయటపడుతుంది, సామాన్యులకి ఈ ప్రశ్నలన్నింటిపైనా ఒక అవగాహన ఉంటుంది మరదేంటో ఈ పార్టీలు 2014 పలితాలతో తెలుసుకుంటాయే, లేక ఆత్బవిమర్శ చేసుకొని నిజాన్ని ఆకలింపుచేసుకొని వ్యవహరిస్తాయే వేచి చూడాలి...

ఇక ఇక్కడ మరో ముఖ్యమైన అంశం వైఎస్సార్‌ సీపీ 1,2,3,.......19 ఇలా అసెంభ్లీలో బలాన్ని పెంచుకోబొతుందా.. నిజంగా వైఎస్‌ మరణం ఎన్నికలని ప్రభావితం చేయబోతుందా ఒక్క స్ఘానంతో ఇదమిద్దంగా చెప్పలేకపోయినా రాబోయే ఎలక్షన్స్‌ని మంచి రసకందాయంలో పడేసాయని చెప్పుకోవాలి,

దేశవ్యాప్త పరిస్థితులు కూడా కాంగ్రెస్‌కి ఏమంత అనుకూలంగా లేని ఈ సమయంలో మద్యంతర ఊహాగానాలు ముసురుకోవడం, అందుకు అనుగుణంగా యూపీయే సబ్యులు బెదిరించడం, అత్యంత కీలకమైన ఆంద్రప్రదేశ్‌ పలితాల సరళిపై టెన్‌జన్‌పథ్ కూర్చోవాల్సిన ఆవశ్యకతనైతే స్రుష్టిస్తున్నాయి..