clean2politics

for save politics to uncivilized politicians

Friday, June 15, 2012

కేవలం పలితాలేనా?

జూన్‌ 12న రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టమయిన తర్వాత అంతా అనుకున్నట్టుగానే, ఎగ్జిట్‌పోల్స్‌ నివేదించినట్టుగానే తీర్పు వెలువడిందనుకొవచ్చు, కాని ఏదైనా అందడం కష్టం అనుకున్నప్పుడు సాదరణ పౌరుడు దానిగురించి ఆశపడడం మానేస్తాడు, దాన్ని సాదించిన వాడిని అపురూపంగా చూస్తాడు కాని రాజకీయం వేరు,  అనుకున్నదే అయినప్పుడు, ప్రజల తీర్పు మాకు అనుకూలంగా లేదని తెలిసినప్పుడు సైతం బరిలో నిలవాల్సిందే పద్మవ్యూహాన్ని చేదించేందుకు సమరశంఖం పూరించాల్సిందే, ఆ తీవ్రమైన ప్రతిఘటన యుద్దంలో జయాపజయాలపై ప్రబావం చూపుతుంది, ఎదుటివాడి విజయావకాశాల్ని దెబ్బతీసి ప్రజల మన్నన పొందేందుకు దారి చూపుతుంది, కాని రాష్ట్రంలో అది తిరగబడినట్టుంది, రెండు,మూడు వేల మెజార్టీతో మెజార్టీ స్థానాల్లో వైసీపీ గట్టెక్కుతుందని బావించిన ఎగ్జిట్‌ పోల్స్ నడ్డి విరిచింది, అలాంటిఇలాంటి మెజార్టీ కాదు రెండు ప్రదాన పార్టీలకి, ఒక ఉద్యమపార్టీకి భవిష్యత్‌పై బెంగపెట్టుకొనే తీర్పుని  ఇచ్చింది. రెండు లక్సల తొంబైవేల పైచీలుకు మెజార్టీతో పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడం కాకలు తీరిన కాంగ్రెస్‌ యేదులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది,జగన్‌ భారీ మెజార్టీ సాదించినప్పుడు వైఎస్‌ కొడుకుగా సానుభూతి పవనాలపై గెలిచాడని తీర్మానించిన పార్టీలు, విశ్లేషకులు, జగన్‌ కుటుంబ వ్యక్తి కాని మరో అబ్యర్థి ఇంత బారీ మెజార్టీపై గెలిస్తే మళ్లీ అవే మాటలు చెప్పడం వారి ఆలోచనా వైపల్యంగా బావించాలా? ప్రస్తుత గండం గట్టెక్కించుకునేందుకు నిందలాపనలు యదాలాపంగా ఆలపిస్తే నష్టపోయేదెవరో తెలియనంత అమాయకులనుకోవాలా?.  ముప్పై మూడు మంది ఏపీ ఎంపీలతో అదికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌,   స్వయంక్రుతాపరాదానికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వస్తుందనే ఊహని భయంతో అదిగమిస్తుందో యుక్తితో అధిగమిస్తుందో వేచిచూడాలి. ఇక అసెంబ్లీ పలితాలకు వస్తే 7స్థానాల్లో కాంగ్రెస్‌, 5 స్థానాల్లో టీడీపీ డిపాజిట్ల గల్లంతు అదీ ఇంకో రెండు సంవత్సరాల్లో సార్వత్రిక ఎన్నికలు ముందుంచుకొని దీనిని ఆయా పార్టీల హ‍ేమాహేమీలు ప్రాథమికంగా విశ్లేషించిన తీరు ఆశ్చర్యం కలిగించక మానదు, కేవలం సానుభూతి పవనాలతోనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న జగన్‌ గట్టెక్కాడనడం  వారి ఆలోచనా వైచిత్రికి నిదర్శనం. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలలో జగన్‌ తన తల్లి విజయమ్మ విజయానికి, ఆరునెలల క్రితం జరిగిన కొవూరు విజయానికి నిన్న జరిగిన 15 అసెంబ్లీ 1 పార్లమెంట్‌ స్థానాల విజయానికి ఒక్క సానుభూతే కారణమైతే ఏదో ఒక రకంగా ఆ సానుభూతిని ఇప్పటివరకూ దిగ్విజయంగా కాపాడుకుంటూ వస్తున్న వైసీపీ ఇంకా రెండేళ్లవరకూ (మద్యంతరం రాకపోతే) దానిని కాపాడుకోలేదా?. అప్పుడు కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఈ పార్టీలు ఇవే మాటల్ని వల్లిస్తాయా సరే పార్టీల జయాపజయాల గొడవని ఇలా వదిలేస్తే.
                        ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పై అంతిమం, అది పాటించడమే మన రాజ్యాంగ దర్మం, అంతటి ప్రాముఖ్యమైన ఓటరన్న ప్రలోబాలకు లొంగుతున్నాడా?  తనకేం కావాలో ఆలోచించుకునే విచక్సనని కోల్పోయాడా? ఇలాంటి అబిప్రాయాలు అటు రాజకీయనాయకులనుండే కాకుండా ఒక వర్గం మీడియానుండి, మీడియా విశ్లేషకుల నుండి వెలువడుతుండడం మన అద్రుష్టమో, దురద్రుష్టమో, తీవ్రమైన ఆర్థిక అబియేగాలు ఎదుర్కోంటున్న జగన్‌ని అతడి అవినీతిని ప్రజలు గుర్తించడంలేదని వీరు చెపుతున్న తీరు ఆశ్చర్యం గొలుపక మానదు, మన 10మంది దోషూలు తప్పించుకున్నా పర్లేదు ఒక నిర్దోషికి శిక్స పడకూడదనే మన న్యాయ మైళిక సూత్రాన్నే వీరు ప్రశ్నిస్తున్నట్టన్సిస్తుంది, ప్రస్తుతం జగన్‌ ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి మాత్రమే ఇంకా అవి న్యాయపరంగా రూడి కాలేదు. అంతమాత్రాన అతని నిర్దోషి అనగలిగేంత పారదర్శక సత్యాలు మన కల్ల ముందు కనిపించడం లేదు, కాని ఆరోపణలు ఎదుర్కోని రాజకీయనేతని వేతికిన పట్టుకోలేకపోవడం మన స్వతంత్ర భారతావని చేసుకున్న దురద్రుష్టం కాబోలు, ఈ సత్యాన్ని విశ్లేషకులు కనిపెట్టలేకపోవచ్చు, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పేర్కోనే మీడియా ఆకలింపు చేసుకోకపోవచ్చు, ఎవరి కోసం ఈ స్వతంత్ర భారతావని గర్వంగా నిలబడిందే ఆ సామాన్య ఓటరు కనిపెట్టాడు, అందుకే రోగమోస్తే ఆస్తులు అమ్ముకొని రోగాన్ని తగ్గించుకున్నా అప్పుల బాదకి ఆత్మహత్య చేసుకొనే సామాన్యుడు ఆశించిన కనీస వైద్య సదుపాయాన్ని రాజశేఖర రెడ్డి కల్పించాడనే వాస్తవం ఒటరు ఈ ఎన్నికల్లో చెప్పుండొచ్చు, వ్యవసాయమే జీవనాదారమైన 80శాతం భారత గ్రామీణంకి అండగా ఉండే అనేక అవసరాలని రాజశేఖర రెడ్డి తీర్చాడనే నిష్టూర సత్యాన్ని నేటి తీర్పుతో చెప్పుండొచ్చు,  ప్రాథమిక విద్యకే గుండె చెరువయ్యే సామాన్యుడి కొడుకుకి ఉన్నత విద్యని తీసుకొచ్చి పట్టాలతో అందించిన ఆప్యాయతకి ఓటేసాడనే విషయం విశ్లేషకులకి తట్టకపోవడం ఒక వైచిత్యం,  అలాగని రాజశేఖర రెడ్డి పరిపూర్ణ రాజకీయనేత అనిచెప్పలేం, ఆయన  ఆశ్రిత పక్సపాతానికి అనేక రుజువులు ప్రజల ముందు కనబడుతున్నాయి, అవినీతి జరిగిన తీరు క్విడ్‌ప్రో కోలకు ఎన్నో కొన్ని రుజువులు వున్నాయి, అయిన పలితాలు ప్రబంజనంలా జగన్‌ని  చుట్టేస్తున్నాయంటే విశ్లేషకులు చెప్పినట్టుగా ప్రజలు అన్నట్టుగా ''ఆ ఎవడు తినలేదులే మాకింత పెట్టినవాడెవడైనా మంచోడే''  అనే పరిస్థతి కి ఎవర్ని నిందించాలి, ప్రజల్ని ఆ స్థాయికి చేర్చిన ప్రబుత్వాలనా?తమ సొమ్మునే అప్పనంగా తింటున్నా నాకెందుకులే అనే సామాన్యున్నా?  ప్రభుత్వాల అంతిమ లక్సం సామాన్యుడి పెదవులపై చిరునవ్వు అని తెలిపిన మన స్వాతంత్యం ఆ దిశగా 66 సంవత్సరాల ప్రయాణంలో సాదించినదేమిటి? సంపద పోగు చేయడం అతికొద్దిమందికి దాన్ని దారదత్తం చేయడం ఏ నయా సోషలిజం? వేల నుండి లక్సలుగా ప్రజాప్రతినిదుల జీతాలు పెరిగినా ఇంకా దేనికోసమే వెతికే మన రాజకీయ వ్యబిచారుల ఆశకి అంతేమిటి? ఈ ఎన్నికల గెలుపోటముల క్రీడకి ఇంకెన్నాళ్లు మెజార్టీల ముసుగులు తొడుగుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ మనం పయనిస్తున్న దారి ఏదారికి తీసుకెల్తందో వేచిచూద్దాం. మరో మహాత్మాగాంది, మరో లాల్‌బహదూర్‌ శాస్త్రి, మరో అంబెద్కర్‌ ఇలాంటి దార్శనికులు తీసుకొచ్చే సంస్కరణలతో మన స్వాతంత్యం మన ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని ఆశిద్దాం.