clean2politics

for save politics to uncivilized politicians

Tuesday, May 31, 2011

రాజకీయ మకీలీలకు చరమగీతం పాడుదాం

ఏం జరుగుతుందో తెలియదు
ఎందుకు జరగాలనుకుంటుందో తెలియదు
కానీ
జరగడం తథ్యం అనిపిస్తుంది, అది కనిపిస్తుంది

విశ్రుంఖలంగా మితిమీరుతున్న అలజడిని
అవిశ్రాంతంగా శ్రమిస్తున్నఆరాచకాన్నీ
చూస్తూ.. చేతలుడిగిపోతూ ఆగలేననే నిజాన్ని

బయటపెడుతుంది.
సహనానికి హద్దనే పెద్ద మాటలొద్దంటూనే
నిస్సహాయత వెన్ను విరుస్తూ మెగ్గ తొడుగుతుంది.
పాలెన్ని పోసినా పామునైజం మారదనే
నిజాన్ని నమ్ముతూ
నిస్సిగ్గుగా దోచుకునే ఈ రాజకీయ రాబందుల
రెక్కల్ని విరచడానికి, రక్తాన్ని పిండేయడానికి
జరగాల్సింది జరుపిస్తుంది.
అవును జరిగింది
అదిగో నవయవ్వన నూతన శకం
కనిపించలేదా...

నా కళ్లతో చూడండి
అవినీతి లేని, అన్యాయం లేని
దోపిడి లేని, పీడనలేని
నా బావి భారతాన్ని..

Wednesday, May 18, 2011

రాజకీయాలు నిశిత పరిశీలన

మే 13న వెలువడిన అయిదు రాప్ల్రాల ఎన్నికల ఫలితాలు
భరతజాతి వివేకతని ప్రతిబింబించాయి అనడంలో ఎలాంటి సందేహం లేకపోవచ్చు
దాదపు ౩౪ సంవత్సరాలుగా బెంగాల్ ని పరిపాలిస్తున్న వామపక్స్కాలకు, వారితోపాటు
యావద్దేశంలో ఉన్న రాజకీయ నేతలకు పరిణతి చెందిన ప్రజలు నేర్పిన నూతన పాఠం.
నియంతుత్వ విదానాలతో, ప్రజా (పేదల) సంచెమాన్ని మరిచిన పాలకుల
నడ్డి విరచడానికి తన వద్దనున్న బ్రహ్మస్రాన్ని ఎలా ప్రయేగిస్తాడో
సామాన్యుడు మాన్యులకి విడమరిచి చెప్పిన రోజు.
చేతలు మరిచిన లెప్టిస్టులని సింగూర్‌కి అంతిమంగా పంపిన రోజు

ఇక తమిళనాట యదావిదిగా అదికారం చేతులు మారిన
నేటి తీర్పు మాత్రం అక్కడి ఓటరు విజ్జతని బయటపెట్టింది.
నేను, నా కోడుకు, నా కూతురు, నా మనమడు ఇలా అదికారం మెత్తం
తన బందుగణ ప్రీతికి, అక్రమ సంపాదనకి రాచమార్గం అనుకున్న
కురువయేవ్రుద్ద కరుణానిదికి తిరుగులేని తీర్పు. దానితో పాటు
అన్ని రంగాల్లో అందపాతాళానికి దిగజార్చినా, డెబ్బె ఏళ్ల స్వతంత్ర
బారతావనిని ఎక్కువరోజులు ఏలామంటూ పోలికలు చెప్పె
మన ఏలికలైన కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పు

ఇక తెలివితక్కువ నిర్ణయాలు, పనికిమాలిన పెద్ద ఆలోచనలు
ఎంతటి ప్రబావాన్ని చూపిస్తాయి, చెయాల్సిన నష్టాన్ని ఎలా
కలుగజేస్తాయి అనేదానికి నిలువెత్తు తార్కాణం కేరళ ప్రజల నిర్ణయం
అంతో ఇంతో చేసిన వాడికే దిక్కులేకపోతే ఇంక ఓట్లేసి గెలిపించాక
మమ్మల్నేగాలికి వదిలోస్తారోననే సందేహాన్ని నిర్బయంగా వెలిబుచ్చారు కేరళ ఓటరు
అచ్చ్యుతానందన్కి పూర్తి భాద్యతలు మెదటే అప్పగిస్తే
బెంగాల్ని బంగాళాఖాతంలో కలుపుకున్నా కేరళ నైనా మిగిలేది
పాపం కామ్రేడులకి


ఇక మిగతా రెండు రా‌ష్ట్రాలు సైతం అభివ్రుద్దికే పట్టం కట్టాయి


ఇదిలా వుంటే
కన్నడనాట జరుగుతున్న పరిణామాలు జాతి
సహనాన్ని పరిచ్చిస్తున్నట్టే ఉన్నాయి.
లేకపోతే ప్రజలెన్నుకున్న ప్రభుత్వమా, కేంద్ర ఎలికల
విదానమా అనుకుంటూ ఇద్దరూ కోట్టుకు చస్తుంటే
అన్నమే రామచంద్రా అంటున్న ప్రజల్ని ఇంకెవరు పట్టించుకుంటారు
అవినీతి ఆరోఫణలు ఉన్న వ్యక్తులకే మళ్ళీ మళ్ళీ కుర్చిని చూపించే
బీజేపీ ఒకవైపు, స్వయం పాలిత రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఉన్న
ప్రభుత్వాన్ని పడగొట్టడమే ద్యేయంగా ముందుకు కదులుతున్న కాంగ్రెస్ మరోవైపు
ఇదీ మన దౌర్బాగ్యం లేకపోతే ఉన్న రెండు పెద్ద పార్టీలు
ఇంత నీతిమాలిన రాజకీయం చేస్తుంటే. కేవళం ఓటుహక్కున్నమనమేం చేయగలం.

చేస్తాం చేసి చూపిస్తాం ఆ బ్రహ్మస్రాన్ని ఉపయేగించడంలో
సామాన్యుడు చూపే తెగువని కళ్లారా ఆస్వాదిద్దాం..